Wednesday, 04 November 2026 05:38:59 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

ఫర్నిచర్ అసిస్టెంట్ మూడు నెలల రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ – భద్రాద్రి కొత్తగూడెం యువతకు జిల్లా కలెక్టర్ పిలుపు.

Date : 30 October 2025 08:07 PM Views : 509

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నవంబర్ 6న కలెక్టరేట్‌లో డ్రాయింగ్‌పై టెస్ట్, ఈ రెండవ విడత బ్యాచ్‌కు రిజిస్ట్రేషన్, వసతి మరియు భోజనం ఏర్పాటు,ఫర్నిచర్ అసిస్టెంట్ మూడు నెలల రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా ఉపాధి పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కొత్తగూడెం జిల్లా యువతకు కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఐఏఎస్ పిలుపునిచ్చారు.దీనికి గాను నవంబర్ 6న కలెక్టరేట్‌లో డ్రాయింగ్‌పై టెస్ట్ నిర్వహించబడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం ద్వారా యువత ఫర్నిచర్ ప్రొడక్షన్, ఇన్‌స్టలేషన్ మరియు మెషిన్ ఆపరేషన్ రంగాల్లో నైపుణ్యం సాధించి స్థిరమైన ఉద్యోగ అవకాశాలు పొందగలరని ఆయన చెప్పారు.జిల్లాలో ఇప్పటికే మొదటి విడతలో 8 మంది గిరిజన యువత NSTI–FFSC, హైదరాబాద్‌లో శిక్షణ పూర్తి చేశారని, వారు ₹15,000 వేతనంతో అప్రెంటిస్‌గా ఉన్నారని తెలిపారు.ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా రెండవ విడతకు 20 మంది అభ్యర్థులు ఎంపిక చేయబడనున్నట్లు కలెక్టర్ తెలిపారు.ఒక బ్యాచ్‌ తరువాత మరో బ్యాచ్‌కు శిక్షణ ఇవ్వనున్నట్లు కూడా తెలిపారు.ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 5 లోపు ఈ క్రింది గూగుల్ ఫారం ద్వారా లేదా క్యూ ఆర్ కోడ్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.డ్రాయింగ్‌పై టెస్ట్ నవంబర్ 6, 2025 న ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌లో నిర్వహించబడుతుందని,ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ నవంబర్ 15, 2025 నుండి NSTI–FFSC, హైదరాబాద్‌లో ప్రారంభమవుతుందని తెలిపారు.అభ్యర్థుల అర్హతలు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత. 18 - 35 సంవత్సరాల వయస్సు.డ్రాయింగ్ టెస్ట్‌లో ఉత్తీర్ణత.ఆధార్, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు తప్పనిసరి. ఆధార్ మరియు బ్యాంక్ అకౌంట్‌లు అభ్యర్థి మొబైల్ నంబర్‌తో లింక్ అయి ఉండాలి.శిక్షణ పూర్తయిన తర్వాత నెలకు రూ.15,000 నుండి రూ.30,000 వరకు వేతనంతో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ వివరించారు.రిజిస్ట్రేషన్, వసతి మరియు భోజనం ఏర్పాటు కాగా, రిజిస్ట్రేషన్ ఫీజు జిల్లా యంత్రాంగం తరపున అందించనుండగా,Abhimanya Interio Pvt. Ltd. సంస్థ Managing Director దిలీప్ వర్మ CSR (Corporate Social Responsibility) పథకం కింద అభ్యర్థుల కోసం హైదరాబాద్‌లో వసతి మరియు భోజన సదుపాయం అందించనున్నట్లు కలెక్టర్ గారు తెలిపారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు.నిపవలసిన గూగుల్ ఫామ్: https://tinyurl.com/4zv2bn67 , సంప్రదించవలసిన నెంబర్లు:79958 06182,77994 70817.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :