తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ( తెలుగు వెలుగు ) సెప్టెంబర్ 25: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు డిఎస్పి రెహమాన్ ఆదేశానుసారం కొత్తగూడెం త్రీ టౌన్ సిఐ శివ ప్రసాద్ ఆధ్వర్యంలో కొత్తగూడెం రైల్వే స్టేషన్ వద్ద ఆటో డ్రైవర్లకు డ్రగ్స్ నివారణ కొరకు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ .. ప్రతి ఒక్కరు మత్తుకు బానిసలు కాకుండా వారిని నమ్ముకున్న కుటుంబాలు రోడ్డున పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గంజాయి కి సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిసినట్లయితే వెంటనే పోలీసువారికి సమాచారం ఇవ్వగలరని అన్నారు. సమాచారం తెలిపిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు . ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ రఘు, సిబ్బంది హీమాలాల్, ,వెంకట్, నాగరాజు, కృష్ణమూర్తి పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ