Wednesday, 16 September 2026 07:38:21 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

వేగవంతంగా గోదావరి పుష్కర పనులు. జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 29 August 2026 08:39 PM Views : 98

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వచ్చే ఏడాది 2027 జూన్ - జూలై నెలలో జరుగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని భద్రాద్రి జిల్లాలోని ఆయా పుష్కర ఘాట్ ల వద్ద భక్తుల సౌకర్యార్థం పుణ్య స్నానాలు ఆచరించేందుకు వీలుగా సదుపాయాల కల్పన పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో కలిసి హైదరాబాద్ నుండి శనివారం రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంత రావులు ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించిన దృష్ట్యా, పుష్కర ఘాట్ల వద్ద విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని వారు సూచించారు. ఇప్పటికే ఆమోదం పొందిన పనులను మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానించి తక్షణమే ప్రారంభించాలని అన్నారు. ఈ పనుల పర్యవేక్షణ కోసం తగిన అనుభవం కలిగిన సీనియర్ అధికారిని స్పెషల్ ఆఫీసర్ గా నియమించాలని అన్నారు.భూసేకరణ అవసరమైన పక్షంలో వెంటనే ప్రతిపాదనలు పంపాలని సూచించారు. పుష్కరాలకు మరో పది నెలల గడువు మాత్రమే మిగిలి ఉన్నందున సదుపాయాల కల్పన పనులను చేపట్టి వేగవంతంగా పూర్తి చేయాలని హితవు పలికారు. వారం వారం పనుల ప్రగతిని సమీక్షిస్తూ, నివేదికలు సమర్పించాలని సూచించారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సందర్భంగా భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ.. జిల్లాలోని భద్రాచలం పుష్కర క్షేత్రం వద్ద భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్నామని తెలిపారు. ఎండోమెంట్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ తదితర శాఖల ఆధ్వర్యంలో పనులు వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. అదేవిధంగా జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాలైన పర్ణశాల, మోతే పట్టి నగర్ పుష్కర ఘాట్ ఏర్పాటు కోసం క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్నామని తెలిపారు.పుణ్య స్నానాలు ఆచరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులతో పాటు వీ.ఐ.పీలు, వీ.వీ.ఐ.పీలు తరలివచ్చే అవకాశాలు ఉన్నందున వాహనాల పార్కింగ్, సరైన రోడ్డు వసతి, అత్యవసర ఎగ్జిట్ వంటి అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. పుష్కర ఘాట్ల వరకు అప్రోచ్ రోడ్లు, ఘాట్ల మరమ్మతులు వంటి పనులను ప్రాధాన్యతాక్రమంలో చేపట్టాలని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :