తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కాంగ్రెస్ పార్టీ ఓబిసి సెల్ భద్రాద్రి జిల్లా సెక్రటరీగా రంజిత్ సాయి కుమార్ ను నూతనంగా నియమిస్తూ నియామక పత్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు అల్లాడి నరసింహారావు అందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జిల్లా సెక్రటరీగా నియమితులైన రంజిత్ సాయి కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జిల్లా సెక్రటరీగా నియమించిన ఓబిసి సెల్ జిల్లా అధ్యక్షులు అల్లాడి నరసింహారావు, జిల్లా అధ్యక్షులు పోదెం వీరయ్య, మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వర్రావు, ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, టీపీసీసీ డెలిగేట్, ఎస్సీ సెల్ కన్వీనర్ జేబి శౌరి లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొత్తగూడెం నియోజకవర్గ కాంగ్రెస్ మైనారిటీ అధ్యక్షులు ఎండి గౌస్, టౌన్ యూత్ ప్రెసిడెంట్ ఉస్మాన్, త్రినాధ్, పవన్ సాయి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ