తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అశ్వాపురం మండలంలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే మండలంలోని తోగు వాగులో ఆదివారం ఇద్దరు గల్లంతు అయ్యారు. గల్లంతైన వారికోసం అధికారులు చర్యలు చేపట్టారు. ఇద్దరిలో ఒకరి మృతదేహం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోస్ట్ మార్టం నిమిత్తం మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు
Admin
తెలుగు వెలుగు టీవీ