Friday, 18 September 2026 02:56:51 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

సింగరేణి భవిష్యత్తుకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు

Date : 24 July 2026 12:31 PM Views : 214

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణిని లాభాల బాటలో నడిపించడం అందరి బాధ్యత పోటీ ప్రపంచంలో సింగరేణిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా కార్యాచరణ చేపట్టాలి కొత్త బొగ్గు బ్లాకుల అభివృద్ధితో పాటు క్రిటికల్ మినరల్స్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లోకి విస్తరించాలి సమిష్టి కృషితో సింగరేణిని మరింత బలోపేతం చేయాలి సింగరేణి సంస్థను కాపాడుకోవడం, లాభాల బాటలో నడిపించడం, పోటీ ప్రపంచంలో మరింత బలోపేతం చేయడం, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం అధికారులు, ఉద్యోగులు, కార్మికులు, యాజమాన్యం అందరి ఉమ్మడి బాధ్యత అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సింగరేణి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, సంస్థ భవిష్యత్తుకు అవసరమైన ప్రతి నిర్ణయానికి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్), తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (టీఎస్‌జెన్‌కో) ఉన్నతాధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, జిల్లా కలెక్టర్ అంకిత్, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, ఎస్‌సీసీఎల్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్, ఐఏఎస్, టీఎస్‌జెన్‌కో ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ హరీష్, ఐఏఎస్, ఎస్‌సీసీఎల్ డైరెక్టర్ (పర్సనల్, అడ్మినిస్ట్రేషన్ & వెల్ఫేర్) గౌతమ్ పొట్రూ, జనరల్ మేనేజర్లు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్‌సీసీఎల్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంస్థ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, బొగ్గు ఉత్పత్తి, కొత్త బొగ్గు గనుల అభివృద్ధి, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, ఆధునిక సాంకేతికత వినియోగం, ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ, సంస్థ దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలను వివరించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణకు సింగరేణి ఆత్మవంటిదని, 130 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ సంస్థను కాలానుగుణంగా మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఒకప్పుడు బొగ్గు ఉత్పత్తి రంగంలో సింగరేణిదే ఏకఛత్రాధిపత్యమని, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల బహిరంగ వేలం విధానాన్ని అమలు చేయడంతో అనేక ప్రైవేట్ సంస్థలు రంగంలోకి వచ్చి పోటీ తీవ్రంగా పెరిగిందన్నారు. ఈ పరిస్థితుల్లో నాణ్యత, ఉత్పాదకత, ఆధునిక సాంకేతికత, వ్యయ నియంత్రణ ద్వారా పోటీతత్వాన్ని పెంచుకుంటేనే సింగరేణి భవిష్యత్తు మరింత బలపడుతుందని పేర్కొన్నారు. ఒకప్పుడు బీఎస్‌ఎన్‌ఎల్ దేశంలో అత్యంత బలమైన ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్నప్పటికీ పెరుగుతున్న పోటీని సమర్థంగా ఎదుర్కోలేక వెనుకబడిన విషయాన్ని గుర్తు చేస్తూ, అలాంటి పరిస్థితి సింగరేణికి రాకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు.

జెన్‌కోతో పాటు ఇతర విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు సరఫరా చేసే బొగ్గు అత్యున్నత నాణ్యతతో ఉండాలని స్పష్టం చేశారు. తవ్వకాల సమయంలో బొగ్గులో మట్టి, రాళ్లు, ఇతర మలినాలు కలవకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట బొగ్గు వాషింగ్ చేపట్టి యాష్ కంటెంట్ తగ్గించాలని సూచించారు. గ్రేడ్-4, గ్రేడ్-5, గ్రేడ్-6 ప్రమాణాల ప్రకారం బొగ్గును శాస్త్రీయంగా బ్లెండింగ్ చేసి సరఫరా చేయడం ద్వారా వినియోగదారుల విశ్వాసం పెరుగుతుందని, మార్కెట్లో సింగరేణి ప్రత్యేకత మరింత పెరుగుతుందని తెలిపారు. సింగరేణి లాభాల్లో ఉంటేనే వేలాది మంది కార్మికులు, వారి కుటుంబాల భవిష్యత్తు భద్రంగా ఉంటుందని పేర్కొంటూ, సంస్థను లాభాల బాటలో నడిపించడం ప్రతి అధికారి, ఉద్యోగి, కార్మికుడి బాధ్యత అని స్పష్టం చేశారు. జనరల్ మేనేజర్లు, డైరెక్టర్లు, అధికారులు, కార్మికులు కలిసి ప్రతి గని స్థాయిలో చర్చలు నిర్వహించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. సొంత కుటుంబ అభివృద్ధికి చూపే నిబద్ధతతోనే సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. గత దశాబ్ద కాలంలో కొత్త బొగ్గు బ్లాకుల అభివృద్ధిలో ఆశించిన పురోగతి సాధించలేకపోయామని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి, యాదాద్రి, భద్రాద్రి తదితర థర్మల్ విద్యుత్ కేంద్రాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త బొగ్గు బ్లాకులను గుర్తించి వేగంగా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒడిశాలోని నైనీ బ్లాక్, తాడిచర్ల-2 ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, అటవీ అనుమతుల సమస్యలను వేగంగా పరిష్కరించినట్లు తెలిపారు. రాబోయే 15 నుంచి 20 ఏళ్లలో ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోనున్న నేపథ్యంలో సింగరేణి కేవలం బొగ్గు ఉత్పత్తికే పరిమితం కాకుండా థర్మల్ పవర్, సోలార్, పంప్డ్ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజ్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో కూడా విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు, చిప్ తయారీకి అత్యంత కీలకమైన లిథియం, కోబాల్ట్, రేర్ ఎర్త్ మినరల్స్ వంటి క్రిటికల్ మినరల్స్ అన్వేషణ, మైనింగ్ రంగంలో సింగరేణి ప్రవేశించాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఖనిజాలకు భారీ డిమాండ్ ఉన్నందున ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో క్రిటికల్ మినరల్స్ బ్లాకుల వేలంలో పాల్గొనే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. సింగరేణిలో ఉన్న మైనింగ్ నిపుణులు, ఇంజనీర్లు, కార్మికుల అనుభవాన్ని అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టుల్లో వినియోగించి సంస్థకు కొత్త ఆదాయ వనరులు సృష్టించాలని పేర్కొన్నారు. ఇకపై సింగరేణి బోర్డు సమావేశాలు కేవలం పరిపాలనా అంశాలకు పరిమితం కాకుండా సంస్థ విస్తరణ, పెట్టుబడులు, సాంకేతిక ఆధునికీకరణ, రాబోయే పదేళ్ల అభివృద్ధి వ్యూహంపై చర్చించే వేదికగా మారాలని సూచించారు. కార్పొరేట్ సంస్థల మాదిరిగా స్పష్టమైన లక్ష్యాలు, కాలపట్టిక రూపొందించి నిర్దిష్ట గడువులో పనులు పూర్తి చేసే విధంగా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా పనులను వేగవంతం చేయాలని, వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ అంశాలను ప్రతిరోజూ సమీక్షిస్తూ ప్రత్యేక కార్యాచరణతో పరిష్కరించాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయంతో నిర్ణీత గడువులో లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. ఎల్-నినో ప్రభావం నేపథ్యంలో సింగరేణి సంస్థ తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై కూడా సమావేశంలో సమీక్ష నిర్వహించారు. సంబంధిత శాఖలు సమన్వయంతో ముందస్తు కార్యాచరణ చేపట్టి ఎల్-నినో ప్రభావాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఆదాయం ఆర్జించే ప్రభుత్వ రంగ సంస్థగా సింగరేణిని మరింత అభివృద్ధి చేసి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే సంస్థగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ఉద్యోగులు, కార్మికులు సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు పిలుపునిచ్చారు. ఈ సమీక్ష సమావేశంలో సింగరేణి సంస్థ జనరల్ మేనేజర్లు, డైరెక్టర్లు, జెన్‌కో అధికారులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :