తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కార్పొరేట్ శక్తులతో రేవంత్ రెడ్డి కుమ్మక్కు జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ కొత్తగూడెం: జీవో నెంబర్ 97 వెంటనే రద్దు చేయాలని జైభీమ్ రావు భారత్ పార్టీ (జేబీపీ)రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.శనివారం పాలిటెక్నిక్ విద్యార్థులతో కలిసి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ నందు ప్లకార్డులతో నిరసన తెలిపారు.ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి శాఖలో విలీనం చేయడం వల్ల సాంకేతిక విద్య యొక్క ప్రత్యేకత దెబ్బతింటుందని గతంలో పాలిటెక్నిక్ డిప్లమా కోర్సు చేసిన వారు ఈ-సెట్ ద్వారా నేరుగా బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశం పొందే అవకాశం ఉండేదని రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయం మూలంగా విద్యార్థులు ఉన్నత విద్యలో అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.రేవంత్ రెడ్డి కార్పొరేట్ శక్తులతో కుమ్మకై పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేస్తున్నాడని విమర్శించారు.ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది పాలిటెక్నిక్ విద్యార్థులు టీసీలు తీసుకుంటున్నారని,విద్యార్థుల జీవితాలతో ముడిపడిన అంశం మీద ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేయాలని,విద్యార్థుల భవిష్యత్తుతో చలగాటమాడే ఏప్రభుత్వాలు అయినా,ఏపార్టీలైనా కనుమరుగు కాక తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 97 రద్దు చేయాలని లేని పక్షంలో కలిసి వచ్చే విద్యార్థి సంఘాలను,రాజకీయ పార్టీలను కలుపుకుని ముఖ్యమంత్రి కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున రావు,జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ వీరు నాయక్,వినయ్,బన్నీ,రాజవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ