Saturday, 19 September 2026 09:57:21 PM
# లోక కల్యాణమే లక్ష్యంగా పాదయాత్ర సాగాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్.

ప్రజలకు ప్రభుత్వాన్ని చేరువ చేసేందుకే ప్రగతి ప్రణాళిక : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

Date : 22 May 2026 06:00 PM Views : 142

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అంకితభావంతో పనిచేస్తేనే గ్రామాలు, పట్టణాల అభివృద్ధి మెరుగైన సేవల కోసం ప్రతి శాఖ సమర్థవంతంగా పనిచేయాలి గ్రామస్థాయి సమస్యల పరిష్కారమే 99 రోజుల కార్యాచరణ లక్ష్యం సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యక్రమాలు కీలకం జూన్ 12న ముగింపు ఉత్సవాలను పండుగలా నిర్వహించాలి : కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత చేరువ చేసే గొప్ప కార్యక్రమమని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ కార్యాచరణలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్బులో జిల్లా స్థాయి సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఏ ప్రభుత్వం అయినా తమ విధానాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలంటే ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు అంకితభావంతో పని చేస్తేనే గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ప్రతి శాఖ తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని చెప్పారు. గ్రామస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. దీనివల్ల వివిధ శాఖల, ప్రజా ప్రతినిధుల పనితీరు, ప్రజలకు అందిస్తున్న సేవలపై స్పష్టమైన అవగాహన ఏర్పడిందన్నారు. జూన్ 12న నిర్వహించనున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక ముగింపు ఉత్సవాలను జిల్లావ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. తొలుత వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన, సంక్షేమ, అభివృద్ధి ప్రదర్శన స్టాల్స్‌ను పరిశీలించి, క్షేత్రస్థాయిలో చేపడుతున్న కార్యక్రమాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల జిల్లా అధికారులు తమ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రగతి నివేదికలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, నాయకులు సలిగంటి శ్రీనివాస్, వాసిరెడ్డి మురళి, సిపిఐ పక్ష కార్పొరేటర్లు, సర్పంచులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :