Wednesday, 16 September 2026 08:25:30 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

డిల్లీ నడిబొడ్దున కథంతొక్కిన భద్రాద్రి జిల్లా సిపిఐ శ్రేణులు

Date : 01 September 2026 05:10 PM Views : 83

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ???? లక్షలాది మందికి పోరాట స్ఫూర్తినిచ్చిన రాంలీలా మైదాన్ సభ ???? మార్పుకోసం జరిగే పోరాటాల్లో భద్రాద్రి జిల్లా అగ్రభాగం ???? ప్రజావ్యతిరేక పాలనపై ఢిల్లీ వేదికగా జరిగిన సభ ప్రారంభం మాత్రమే : సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా దేశంలో మార్పు కోసం కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై రాజీలేని సమరశీల పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని, ఆ పోరాటాలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శ్రేణులు ఎల్లప్పుడూ అగ్రభాగాన ఉంటాయని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా స్పష్టం చేశారు. ​దేశంలో మార్పు రావాలనే ప్రధాన నినాదంతో 'బద్లావ్ జరూరి హై' దేశ రాజధాని న్యూఢిల్లీలోని చారిత్రాత్మక రాంలీలా మైదానంలో మంగళవారం నిర్వహించిన భారీ బహిరంగ సభకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నలుమూలల నుంచి 500 మందికి పైగా సిపిఐ శ్రేణులు, కార్మికులు, రైతులు, ప్రజలు భారీ ఎత్తున తరలివెళ్లారు. అజ్మీరీ గేట్ సెంటర్ నుంచి రాంలీల మైదానం వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఐ నాయకులు కార్యకర్తలు భారీ ప్రదర్శన నిర్వహించారు. ర్యాలీని ప్రారంభించిన సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ ​కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా, విద్యార్థి, నిరుద్యోగ, మహిళా వ్యతిరేక విధానాల వల్ల దేశంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ, సామాన్య ప్రజల హక్కులను కాలరాస్తున్న పాలకుల తీరును ఎండగట్టేందుకే రాంలీలా మైదానంలో ఈ మహా గర్జన నిర్వహించామని తెలిపారు. ​ఈ మహాసభ ఇచ్చిన గొప్ప స్ఫూర్తితో రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా సమరశీల ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ర్యాలీలో నాయకులు కల్లూరు వెంకటేశ్వరరావు, మేయర్ మూడ్ గణేష్, సలిగంటి శ్రీనివాస్, మున్నా లక్ష్మీకుమారి, సరెడ్డి పుల్లారెడ్డి, కంచర్ల జమలయ్య, బి పూర్ణచంద్రరావు, మువ్వ వెంకటేశ్వరరావు, చంద్ర నరేంద్ర కుమార్, ఉప్పుశెట్టి రాహుల్, అడుసుమిల్లి సాయిబాబా, మండల కార్యదర్శులు వాగబోయిన రమేష్ అనంతనేని సురేష్ డి సుధాకర్ జక్కుల రాజబాబు, కార్పొరేటర్లు సర్పంచులు పార్టీ ప్రజాసంఘాల బాధ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :