తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 3, 5, 7 డివిజన్లలో జరిగిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ, పాలేరు SIR కో-ఆర్డినేటర్ నాగాసీతారాములు, కొత్తగూడెం SIR కో-ఆర్డినేటర్ మసన్‌పల్లి లింగాజి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ల వారీగా పర్యటించి బీఎల్ఏలు, బూత్ సూపర్‌వైజర్ల పనితీరును సమీక్షించారు. ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో చేర్పించాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన యువతను గుర్తించి ఫారం-6 ద్వారా నమోదు చేయించాలని, డూప్లికేట్ ఓట్లు, మరణించిన వారి పేర్లు ఫారం-7 ద్వారా తొలగించాలని ఆదేశించారు. ఏ ఒక్క అర్హుడి ఓటు గల్లంతు కాకుండా చూడటమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఓటరు జాబితా సవరణలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే వీరహనుమంతరావు,3వ డివిజన్ కార్పొరేటర్ హోలి శ్రీను,5వ డివిజన్ కార్పొరేటర్ నూకల సరితా రంగారావు,7వ డివిజన్ ఇంచార్జ్ సుజాత రాంబాబు,సీనియర్ కాంగ్రెస్ నాయకులు బొల్లం ఉదయ్ కుమార్ యాదవ్ మరియు స్థానిక కాంగ్రెస్ నాయకులు, బీఎల్ఓలు,బీఎల్ఏలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ