Wednesday, 16 September 2026 05:53:32 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

జూలూరుపాడు తాసిల్దార్ కు వినతి పత్రం అందించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు,నెల్లూరు కోటేశ్వరరావు

Date : 23 August 2025 05:26 PM Views : 585

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు బిజెపి మండల కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా బైకు ర్యాలీగా కొమరం భీం విగ్రహం నుంచి తాసిల్దార్ కార్యాలయం వరకు వెళ్లి తాసిల్దార్ కార్యాలయం ఎదుట బిజెపి జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు మరియు బిజెపి నాయకులు కలిసి ధర్నా నిర్వహించి అనంతరం స్థానిక సమస్యలపై తాసిల్దార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రధానంగా జూలూరుపాడు మండలం వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ భూములకు సీతారాం ప్రాజెక్టు ద్వారా తక్షణమే కాలువలు ఏర్పాటు చేసి నీళ్ళు అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేసినారు. ఈ ప్రాంతంలో భూములు కోల్పోయిన రైతులకు నీళ్లు ఇవ్వకుండా వేరే ప్రాంతాలకి నీళ్లు ఇవ్వటం ఈ అన్యాయం, ఇండ్ల విషయంలో కాంగ్రెస్ కార్యకర్తలకే ఇల్లు ఇవ్వడం వేరే పార్టీ అయితే ఇల్లు ఇవ్వము అని చెప్పటం ఇది సిగ్గుమాలిన చర్య, ఇల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉన్నది, పార్టీల సంబంధం లేకుండా అర్హులైన పేదలందరూ కూడా పక్క గృహాలు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. కేంద్ర ప్రభుత్వం కావలసినంత యూరియా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన కూడా, ఇంకా యూరియా సరిపోర్టర్లు లేదంటే కేంద్ర ప్రభుత్వం 50 వేల మెట్రిక్ టన్నుల లో యూరియాని ఇస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యానికి కప్పుపుచ్చుకోవడానికి యూరియా కొరత కేంద్ర ప్రభుత్వమే నేడుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు వచ్చినా కూడా ఆ రాష్ట్రాల్లో యూరియా కొరత ఏర్పడుతుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ పాలనకు నిదర్శనం, అర్హులైన అందరికీ పక్కా గృహాలు, పెన్షన్లు రేషన్ కార్డులు వెంటనే అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నెల్లూరు కోటేశ్వరరావు డిమాండ్ చేసినారు. ఈ సందర్భంగా బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ మాట్లాడుతూ బిజెపి జిల్లా అధ్యక్షులతో కలిసి రైతుల పొలాలకు వెళ్లి వారి యొక్క సమస్యలను తెలుసుకోవడం జరిగినది. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసపూరిత హామీలతో గద్దెనెక్కినది. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని చిలుకూరి రమేష్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మాదినేని సతీష్, బిజెపి మండల అధ్యక్షుడు భూక్య రమేష్, నున్న రమేష్, సిరుపరపు ప్రసాద్, తెల్లం నరసింహారావు, అన్నవరపు సత్యనారాయణ, నిమ్మటూరి రామారావు, ధారావత్ బాలకిషన్,భూక్య రాంబాబు, చరణ్, రవి, బిజెపి నాయకులు, కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :