Wednesday, 16 September 2026 05:23:59 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

కార్మికుల న్యాయమైన 31 డిమాండ్ల పరిష్కారమే మా ప్రధాన లక్ష్యం లేకుంటే సమ్మె..

Date : 14 August 2026 06:19 PM Views : 178

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కార్మికుల న్యాయమైన 31 డిమాండ్ల పరిష్కారమే మా ప్రధాన లక్ష్యం లేకుంటే సమ్మె..ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్‌. సింగరేణి కార్మికుల 31 డిమాండ్లను పరిష్కరించడంలో యాజమాన్యం సానుకూలంగా స్పందించాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.హైదరాబాద్‌లో గురువారం జరిగిన ఆర్ ఎల్ సి చర్చల్లో కార్మికుల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినట్లు వారు తెలిపారు. ఈ నెల 21న చర్చలు విఫలమైతే ఫెయిల్యూర్‌ రిపోర్ట్‌ తీసుకొని,అనంతరం అన్ని కార్మిక సంఘాల సహకారంతో సమ్మెకు సిద్ధమవుతామని స్పష్టం చేశారు.మెడికల్‌ బోర్డును ప్రతి నెల మూడో వారంలో నిర్వహించాలని, కారుణ్య నియామకాలు, మెడికల్‌ ఇన్‌వాలిడేషన్‌ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. మెడికల్‌ అటెండెన్స్‌ నిబంధనలను మార్చి కార్మికులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 2016–17 బ్యాచ్‌ జేఎంఈటీల ప్రమోషన్‌ సమస్యను పరిష్కరించి, ఖాళీల ఆధారంగా బీ గ్రేడ్‌ ప్రమోషన్లు కల్పిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చినట్లు తెలిపారు.మారుపేర్ల సమస్య పరిష్కరించాలి మారుపేర్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్‌కుమార్‌ కోరారు.ముఖ్యమంత్రి హామీ మేరకు ఏర్పాటు చేసిన ఏడుగురు సభ్యుల కమిటీ ద్వారా సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. బాధిత కార్మికుల ఉద్యమానికి ఏఐటీయూసీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.సింగరేణికి ప్రభుత్వం నుంచి రావాల్సిన 54 వేల కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని నాయకులు డిమాండ్‌ చేశారు. సొంత ఇంటి పథకాన్ని అమలు చేయడంతో పాటు హెచ్‌ఆర్‌ఏను 8 శాతానికి పెంచాలని కోరారు. కట్‌ చేసిన ఇంక్రిమెంట్ల సమస్యను పరిష్కరించాలని, పెండింగ్‌ విజిలెన్స్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. సింగరేణిలో అన్ని విభాగాలను అవుట్‌సోర్సింగ్‌కు అప్పగించకుండా సింగరేణి యాజమాన్యమే నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ‘ఎన్‌ మైనస్‌’ విధానాన్ని ఎత్తివేయాలని కోరారు. సహజ మరణం పొందిన కార్మికుల కుటుంబాలకు అందించే పరిహారాన్ని పెంచాలని డిమాండ్‌ చేశారు.పెర్క్స్‌ ఐటీపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి పెర్క్స్‌పై విధిస్తున్న ఐటీ భారంపై సింగరేణి యాజమాన్యం స్వతంత్రంగా నిర్ణయం తీసుకుని కార్మికులకు న్యాయం చేయాలని వారు అన్నారు. 31 డిమాండ్లలో కీలకమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కాలయాపన చేస్తే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించాలినీ. ఈ నెల 21 తర్వాత కూడా పరిష్కారం లభించకపోతే అన్ని కార్మిక సంఘాలను కలుపుకుని సమ్మెకు వెళ్తాం” అని వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్, బ్రాంచ్ కార్యదర్శిలు రమణమూర్తి,జక్కుల గట్టయ్య,ఉపాధ్యక్షులు క్రిస్టోఫర్‌,సహాయ కార్యదర్శి రాము,తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :