తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం: భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 17వ డివిజన్ లో డివిజన్ అధ్యక్షులు దాట్ల సందీప్ కుమార్ గారి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీపీసీ జనరల్ సెక్రటరీ నాగాసీతారాములు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు.మాట్లాడుతూ స్వాతంత్ర్యం ఎందరో మహనీయుల త్యాగాల ఫలితం. మహాత్మా గాంధీ, నేతాజీ, భగత్ సింగ్ లాంటి ఎందరో మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ సమైక్యత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలి. ప్రభుత్వ సిబ్బంది ప్రజాసేవకు అంకితభావంతో ఉండాలి. యువత విద్య, క్రమశిక్షణ, దేశభక్తితో ముందుకు సాగాలి అని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో జిల్లా నాయకులు,మండల నాయకులు, డివిజన్ నాయకులుపెద్దఎత్తున పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ