తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం(భద్రాచలం ), సెప్టెంబర్ 5, భద్రాచలం గోదావరి బ్రిడ్జి ఎక్సైజ్ చెక్ పోస్ట్ వద్ద ఒడిషా రాష్ట్రం మల్కాన్గిరి నుండి హైదరాబాద్ కు తరలిస్తున్న 50.980కేజీల ఎండు గంజాయిని డీసీ జనార్ధన్,ఏసీ జి . గణేష్ గారి ఆదేశాల మేరకు ఏఈ ఎస్ కే .తిరుపతి, ఇన్స్పెక్టర్ సి హెచ్ . శ్రీనివాస్, సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ కరీం, బాలు, కానిస్టేబుల్స్ సుధీర్, వెంకట్, హనుమంతరావు, విజయ్ లు వల పన్ని పట్టుకున్నారు . హ్యుందాయ్ ఆక్సెంట్ కార్ యూపీ 16 ఏ ఏ 0629 లో గంజాయిని తరలిస్తున్న మల్కాన్గిరికి చెందిన లాలూ పైక్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని సెల్ ఫోన్ సీజ్ చేశారు.కేసు నమోదు నిమిత్తం భద్రాచలం ఎక్ససైజ్ సీఐ రహీమున్నీ బేగం కు అప్పగించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ