Saturday, 19 September 2026 01:34:34 PM
# హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు.

రైతు సంక్షేమం మే లక్ష్యంగా రూపొందిన ప్రత్యేక రెవిన్యూ చట్టమే భూ భారతి ,జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

Date : 24 April 2025 05:48 PM Views : 644

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 24తెలుగు వెలుగు)తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టంపై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రెవిన్యూ జిల్లా మండల అధికారుల ఆధ్వర్యంలో జూలూరుపాడు మండల కేంద్రంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వైరాఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ భూముల నిర్వహణ భూముల రిజిస్ట్రేషన్ భూమి హక్కుల రక్షణలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చి అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిబద్దతగా ఆలోచించి ఈ చట్టానికి రూపకల్పన చేయటం జరిగిందన్నారు ఈ చట్టం ద్వారా భూములపై ఉన్న సందేహాలు వివాదాలు నివృత్తి చేస్తూ భూ యజమానులకు న్యాయమైన హక్కులు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించబోతుందని పేర్కొన్నారు న్యాయబద్ధంగా భూమి కలిగిన ప్రతిఒక్కరికి భద్రత కలిగేలా ఈ చట్టాన్ని రూపొందించారన్నారు భూభారతి రెవెన్యూ చట్టం యొక్క ముఖ్య లక్ష్యాలను ఈ సందర్భంగా తెలియజేశారు భూ రికార్డుల పారదర్శకతను మెరుగుపరచడం భూములపై జరుగుతున్న వివాదాలను తొలగించడం భూములకు సంబంధించిన సమాచారాన్ని డిజిటలైజేషన్ ద్వారా అందుబాటులోకి తేవడం భూమి హక్కుల పరిరక్షణకు బలమైన చట్టబద్ధమైన ఆధారాన్ని కల్పించడం ఇది ఒక పౌరునిగా మీ హక్కులు మీ చేతిలో పెట్టే చట్టం. అందుకే మనం అందరం ఈ చట్టాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ పార్టీ జిల్లానాయకులు లేళ్ల వెంకట్ రెడ్డి, విజయ భాయ్ ,పార్టీ మండల అధ్యక్షుడు మంగీలాల్ నాయక్, ఎంపీడీవో కరుణాకర్ రెడ్డి, ఎమ్మార్వో స్వాతి బిందు, కాంగ్రెస్ పార్టీకార్యకర్తలు రైతు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :