తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి కంపెనీ 2024-25 ఆర్థిక సంవత్సరానికి ₹2360 కోట్ల లాభం సాధించింది. దీని 34% లాభం కార్మికులకు పంచాలని నిర్ణయించింది. శాశ్వత కార్మికులకు మొత్తం ₹802.4 కోట్లు ఇవ్వనున్నారు, ఒక్కో కార్మికునికి సగటున ₹1.95 లక్షలు వస్తాయి. కాంట్రాక్ట్ కార్మికులకు ప్రత్యేకంగా ₹5,500 చొప్పున పంపిణీ జరుగనుంది. మొత్తం లాభాల్లో ₹819 కోట్లు పర్మనెంట్ మరియు కాంట్రాక్ట్ కార్మికులకు వెళ్ళనుండగా, ఇది సింగరేణి చరిత్రలో మరోసారి కార్మికులకు ఆనందం నింపే నిర్ణయమని ప్రభుత్వం ప్రకటించింది.
Admin
తెలుగు వెలుగు టీవీ