Wednesday, 16 September 2026 06:52:43 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

మన ఆయుర్వేద వైద్యం మోడ్రన్ వైద్యానికి ధీటుగా ఉండాలి.ఆయుర్వేద మహర్షి రవి వర్మ.

Date : 09 September 2026 08:37 PM Views : 83

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మన ఆయుర్వేద వైద్యం మోడ్రన్ వైద్యానికి ధీటుగా ఉండాలి.ఆయుర్వేద మహర్షి రవి వర్మ.ఔషధ మొక్కలు పెంపకానికి ప్రోత్సాహాన్ని కల్పిస్తాం. పిఓ రాహుల్ ఐ.ఏ.ఎస్.ప్రస్తుతం వస్తున్న వ్యాధులను అరికట్టేందుకు, మోడరన్ వైద్యానికి దీటుగా మన పారంపర్యవైద్యం ఉండాలని ప్రముఖ ఆయుర్వేద మహర్షి రవివర్మ అన్నారు. ఆయుర్వేద ఫార్మసీలకు లైసెన్సులను పొంది, మన ఉనికిని చాటి చెప్పేందుకు లీగల్గా ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మనకున్న బలహీనతలను అధిగమించి, ప్రపంచవ్యాప్తంగా మన ఆయుర్వేదాన్ని చాటి చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. అనంతరం ఐటిడిఏ పిఓ బి. రాహుల్ (ఐ.ఏ.ఎస్) మాట్లాడుతూ.. భద్రాచలం పరిసర ప్రాంతాలలో ఆయుర్వేద ఔషధ మొక్కలు అనేక వందల రకాలు ఉన్నాయని, వాటిని మీ వైద్యులు సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం ఇదివరకే ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా ఆయుర్వేదానికి అనేక అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. ఆయుర్వేద అభివృద్ధికి మీ సంఘం ముందుకు వస్తే, దానికి సంబంధించిన విషయాలను ప్రభుత్వంతో మాట్లాడి, ఔషధ మొక్కలు పెంచుకునేందుకు కొంత భూమిని సైతం కేటాయింప చేయిస్తానని వెల్లడించారు. నా చిన్నప్పటినుంచి మా కుటుంబంలోని సభ్యులకు, అనేక అనారోగ్య సమస్యలను అధిగమించేందుకు, ఎక్కువగా ఆయుర్వేదాన్ని అనుసరించి తగ్గించుకునే వారమని గుర్తు చేసుకున్నారు. అనంతరం రంపచోడవరం శాసనసభ్యురాలు మిరియాల శిరీషాదేవి మాట్లాడుతూ ..కెమికల్స్ లేని ప్రకృతి ఇచ్చిన మొక్కలతోనే తయారుచేసిన మందులను వాడటం ఆరోగ్య దాయకమని తెలియజేశారు.అడిషనల్ డిఎం అండ్ హెచ్ ఓ డా.సైదులు మాట్లాడుతూ వారంపర వైద్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆయుష్ శాఖ ద్వారా పనిచేస్తుందని తెలిపారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, స్థానిక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంఘం వెంకట పుల్లయ్య మాట్లాడుతూ..తక్కువ ఖర్చుతోనే పారంపర్య వైద్యం ద్వారా అనేక రకాలైన మొండి వ్యాధులను తగ్గించుకునే అవకాశం ఉందని, దీని వ్యాప్తిని పేద ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు,ఈ సభలో మల్లిశాలస్వామీజీ, కృష్ణయ్య స్వామి, పుత్తూరు వైద్య వ్యవస్థాపకులు చంద్రశేఖర రాజు, వారం పర్య వైద్య మహా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు దొంతు యాత్రి మహా రుషి, ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వర్లు, ఎండి.జమాల్ ఖాన్, రామంచి శ్రీనివాస్, భాను ప్రసాద్, దుర్గారాణి, అరుణ, వీరభద్రాచారి, రామకృష్ణ, వాహదలి, బొబ్బిలి మోహన్, పద్మారావు, సిహెచ్ రవీందర్, రాచూరి రాజు, ఆ సంఘం జిల్లా కన్వీనర్ జి. సుగుణారావు, నాగేశ్వరరావు లు పాల్గొనీ మాట్లాడారు. 500 రకాల ఔషధ మొక్కలను, మహాసభల స్టాల్లో ఏర్పాటుచేసిన కొత్తగూడానికి చెందిన మొక్కల వెంకటయ్యను ఈ సందర్భంగా రాహుల్ అభినందించారు. వైద్యులు, ఆయుర్వేద శాస్త్రం ప్రకారం వాత, పిత్త, కపాలను తెలియజేసే బయోక్లాక్ (జీవగడియారాన్ని) ఆవిష్కరించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :