Wednesday, 16 September 2026 10:43:26 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

ఐఎస్ జి ఎఫ్ జాతీయ సమ్మేళనంలో తెలంగాణ కు బెస్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు.

Date : 11 November 2025 11:56 AM Views : 477

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సామాజిక సేవా కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణతో పాటు అనేక సాంఘిక, సామాజిక అంశాలతో ముడిపడిన ఇండియన్ స్కౌట్ అండ్ గైడ్ ఫెలోషిప్(ఐ ఎస్ జీ ఎఫ్) జాతీయ సమ్మేళనంలో ఫిలిం ఫెస్టివల్ విభాగంలో జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి బెస్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు లభించింది. సామాజిక సేవా కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణతో పాటు, నీటి వినియోగం, మానవ వనరుల పరిరక్షణ, అనేక సాంఘిక అంశాలతో ముడిపడిన ఇతి వృత్తానికి ఈ అవార్డు లభించగా, జాతీయ సమ్మేళనంలో తెలంగాణ రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ ఫిలిం ఫెస్టివల్ అవార్డు ను ఐఎస్ జీ ఎఫ్ ఇంటర్నేషనల్ అధ్యక్షురాలు, జస్టిస్ గీతా మిట్టల్, జాతీయ అధ్యక్షులు (వర్కింగ్) జస్టిస్ కపిలేశ్ ఝవేరి చేతుల మీదుగా అందజేశారు.మూడు రోజుల పాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని భోల్పూర్ శాంతినికేతన్ పట్టణంలోని భారత్ సేవా ఆశ్రమం లో జరిగిన ఐ ఎస్ జిఎఫ్ జాతీయ సమ్మేళనం విజయవంతంగా ముగిసింది.తెలంగాణ రాష్ట్రానికి లభించిన ఈ ఉత్తమ ఫిలిం ఫెస్టివల్ అవార్డు ను ఐ ఎస్ జీ ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్ లోగాని శ్రీనివాస్, కో ఆర్డినేటర్ ఖాసీం, భద్రాద్రి జిల్లా అధ్యక్షులు, రిటైర్డ్ సింగరేణి అధికారి పి. రామకృష్ణా రావు, కోశాధికారి సమ్మయ్య, సాంస్కృతిక విభాగం ప్రతినిధి శనగ రామ చందర్ రావు లు గౌరవ అతిధుల చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐ ఎస్ జి ఎఫ్ జాతీయ అధ్యక్షుడు (ఎగ్జిక్యూటివ్ విభాగం ) మ్యాక్ మిక్కీ, సెక్రటరీ జనరల్ సీమా రాఠి, కోశాధికారి, మరియు ఇండియా ప్రతిష్టాత్మక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు జనరల్ మేనేజర్ (ఫైనాన్స్ ) పద్మిని పిళ్ళయ్ తదితరులు పాల్గొన్నారు. ఫెలో షిప్ బజార్, క్యాంప్ ఫైర్ ఆకట్టు కున్నాయి.బోల్ పూర్ లోని రవీంద్రనాథ్ ఠాగూర్ నివసించిన ఇల్లు, స్థాపించిన శాంతి నికేతన్, విశ్వ విద్యాలయం, ఎకో పార్క్, రవీంద్ర నాధ్ ఠాగూర్ మ్యూజియం తదితర ప్రాంతాల సందర్శన అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని ఉత్తేజ పరిచింది.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :