తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు శుక్రవారం నాడు కొత్తగూడెంలోని సిపిఐ కార్యాలయం నందు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ. కొత్తగూడెం నియోజకవర్గంలో అభివృద్ధి 2009 నుండి 2014 కాలంలో తాను శాసనసభ్యునిగా గెలిచిన తరువాయి నియోజకవర్గంలో రహదారులను ఆధునీకరించి కొత్త రోడ్డు మార్గాలకు బాటలు వేశానన్నారు. కార్మిక పారిశ్రామిక ప్రాంతమైన కొత్తగూడెం పాల్వంచ పట్టణాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. మారుమూల ప్రాంతాలకు సైతం రోడ్డు మార్గాలను నిర్మిస్తున్నామన్నారు. పట్టణంలో కొన్ని ప్రాంతాలలో డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉండడం వల్ల ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలుస్తూ ఉండడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే డ్రైనేజీ లను పూర్తిస్థాయిలో నిర్మించి ఎక్కడ చుక్క నీరు నిలవకుండా చేశామన్నారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛగా మిగిలిన విమానాశ్రయం ఏర్పాటను సైతం అతి త్వరలో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. కొత్తగూడెం కార్పొరేషన్ గా ఏర్పడడం వల్ల రెండు ప్రధాన పట్టణాలు రానున్న కాలంలో అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతాయని చెప్పారు. కార్పొరేషన్ లో పాలనా సాలభ్యం కోసం మూడు ప్రాంతాలలో మునిసిపల్ కార్యాలయాలు ఉంటాయని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ వల్ల విద్య వ్యవస్థలో ప్రపంచంలోనే జిల్లా ఖ్యాతి పెరుగుతుందన్నారు. 2012లో తాను తీసుకువచ్చిన టూరిజం హోటల్ పనులు నాటి పాలకులు ఆదిమరచి నారు. మరల తిరిగి ప్రస్తుతం ఆ పనులు తన హయాంలోనే పూర్తిగా వస్తున్నాయని చెప్పారు. మూతబడిన కర్మాగారాలను తిరిగి తెరిపించుటకు సైతం ప్రభుత్వ పెద్దలను ఒప్పిస్తున్నానని చెప్పారు. కొత్త ప్రాజెక్టులు రావడం వల్ల నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కలుగుతుందని అదేవిధంగా కొత్తగూడెంకు విమానాశ్రయం సాధించి తీరుతానని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి సెంట్రల్ నాయకులు వంగ వెంకట్, ఎస్వీ రమణమూర్తి, సిపిఐ పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య, ప్రజా సంఘాల కన్వీనర్ గెద్దాడ నాగేశ్వరరావు, పట్టణ సహాయ కార్యదర్శి మునిగడప వెంకటేశ్వర్లు, నేరెళ్ల రమేష్, గుత్తుల శ్రీనివాస్, బరిగెల భూపేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ