తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అంగనవాడి పోషణ మాసోత్సవాల్లో భాగంగా అనంతారం అంగన్వాడీ కేంద్రంలో బుధవారం వివిధ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అంగన్వాడీ సూపర్‌వైజర్ నాగమణి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం, చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ కొర్సా రమేష్, సీడీపీఓ జ్యోతి, పంచాయతీ కార్యదర్శి శైలజ హాజరయ్యారు. జూలూరుపాడు మండలంలోని వివిధ అంగన్వాడీ కేంద్రాల టీచర్లు, ఆయా కేంద్రాల పరిధిలోని గర్భిణీ స్త్రీలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొర్సా రమేష్ మాట్లాడుతూ.. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారాన్ని క్రమం తప్పకుండా వినియోగించుకోవాలని సూచించారు. పోషకాహారం తీసుకోవడం ద్వారా తల్లులు, పిల్లలు ఆరోగ్యంగా ఉండటంతో పాటు శిశువుల ఎదుగుదల మెరుగుపడుతుందని తెలిపారు. ప్రతి కుటుంబం పోషకాహారంపై అవగాహన పెంచుకుని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి సహకరించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మండలంలోని అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ