Wednesday, 16 September 2026 09:15:20 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

మాస్టర్ ఈ కే ఆర్గనైజేషన్ కొత్తగూడెం బ్రాంచ్ వారితో రామవరం 16వ డివిజన్ ఆధ్వర్యంలో గ్రామ సేవా యజ్ఞం

Date : 20 June 2026 05:32 PM Views : 524

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మాస్టర్ ఇ .కే శతాబ్ద ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో హెల్త్ క్యాంప్ కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్లో మాస్టర్ ఇ. కే.ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా గ్రామ సేవ యజ్ఞం నిర్వహించారు. శనివారం నాగయ్య గడ్డ లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన గ్రామ సేవ యజ్ఞంలో మాస్టర్ ఇ. కే ఆధ్యాత్మిక సేవా సంస్థ కొత్తగూడెం బ్రాంచ్ ఫౌండర్లలో ఒకరైన శ్రీ రవిచంద్ర ఆధ్వర్యంలో 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ వెంకటేశ్వర్లు దంపతులతో గ్రామ సేవ హోమం , ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి ఆలయంలో రామవరం వాసులకు వారి వారి శరీర రుగ్మతులను బట్టి కేస్ షీట్ (జబ్బుకు సంబంధించిన పత్రం )వివరంగా తాయారు జేసీ జబ్బులను బట్టి వారి దీర్ఘకాలిక శారీరక రుగ్మతులను బట్టి ఉచిత హోమియో మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీ రవిచంద్ర మాట్లాడుతూ ఆరోగ్య నికి ఔషధ సేవ ముఖ్యం కాదు ,ఆరోగ్యమునకు మూలము సరియైన ఆహారము, విహారము అని మనము తోటి వ్యక్తులతో అలాగే ప్రకృతితో వ్యవహరించే తీరు మన ఆరోగ్యానికి మూలమవుతుంది. కాబట్టి అందరూ కూడా వారి, వారి ఆహార వ్యవహారాలను, ప్రవర్తనను సరిచేసుకున్నట్లయితే అందరూ ఆరోగ్యంగా ,ఆనందంగా ఉండగలరు ఆయన అన్నారు. ఆ తర్వాతే ఔషధ సేవ అని పేర్కొన్నారు. అనంతరం 100 మంది పేషంట్లకు ఉచిత హోమియో మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మాస్టర్ ఇ. కే ఆధ్యాత్మిక సేవా సంస్థ సభ్యులు జి లత ,ఆర్ రామారావు, కె శ్రీనివాసరెడ్డి, కె స్వామి, సౌజన్య ,వీరమల్లు ,పి శ్రీధర్రావు ,బి కోటేశ్వరరావు ,కె కమల , నాగేశ్వరరావు ,బి.వి చారి ,ఎస్ మనోహర్ కుమార్, కే శ్రీనివాస్, ఎండి ఫజల్ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ కమిటీ నిర్వాహకులు ఫణి కుమార్ ,పితాని అబ్బులు ,జూపాక రమేష్, నజీర్ ,పాటి మోహన్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :