తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు నేషనల్ అకాడమీ ఆఫ్ కనస్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో పలు రంగాల్లో ఉచిత శిక్షణను అందించి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు న్యాక్ అసిస్టెంట్ డైరెక్టర్ కే వెంకట రాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుండి 35 సం.లు కలిగిన యువతీ యువకులు ఈ ఉచిత శిక్షణకు అర్హులన్నారు. సర్వేయర్, కనస్ట్రక్షన్, ఎలక్ట్రిషన్, ప్లంబర్ జనరల్, పెయింటర్, డెకరేటర్ వంటి వాటిపై 90 రోజుల పాటు శిక్షణను అందించి నూటికి నూరు శాతం ఉపాధి కల్పిస్తామన్నారు. సర్వేయర్కు ఇంటర్ పాస్, ఐటిఐ పాసై ఉండాలని, కనస్ట్రక్షన్, ఎలక్ట్రిషన్కు పదో తరగతి ఆ పైన, మిగతా వాటికి 7వ తరగతి ఆ పై చదువులున్న వారు అర్హులని తెలిపారు. శిక్షణా కాలంలో ఉచిత యూనిఫాం, షూ, హెల్మెట్, స్టేషనరీ ఇస్తారని, శిక్షణ అనంతరం న్యాక్ సర్టిఫికెట్ ఇస్తారని, ఉచిత భోజనంతో పాటు హాస్టర్ సదుపాయం ఉంటుందని చెప్పారు. అదే విధంగా గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు చేసుకునేందుకు కూడా అవకాశం ఉంటుందన్నారు. శిక్షణా కాలంలో స్పోకెన్ ఇంగ్లీష్, సాఫ్ట్ స్కిల్స్, కంప్యూటర్ ట్రైనింగ్ కూడా ఇస్తారని, పూర్తి వివరాల కోసం యూత్ ట్రైనింగ్ సెంటర్, కొత్తగూడెం రోడ్, సుదిమళ్ల, ఇల్లెందు, 9849248650, 98074674319 నెంబర్లను సంప్రదించాలని సూచించారు. ఆసక్తి గల వారు ఈనెల 19 తేది లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ