తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి సంస్థ వ్యాప్తంగా కార్మికుల కోసం శుక్రవారం నుంచి క్రీడా పోటీలు ప్రారంభం కానున్నాయి. 2025-26 సంవత్సరానికిగానూ వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ క్రీడలు నిర్వహిస్తున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్లో ఫుట్బాల్ పోటీలతో ప్రారంభమై, సెప్టెంబర్ 28న సాంస్కృతిక కార్యక్రమాలతో ముగుస్తాయి. ఈ పోటీల కోసం ప్రకాశం స్టేడియం, సీఆర్ క్లబ్, కేసీవో క్లబ్లు సిద్ధమయ్యాయి.
Admin
తెలుగు వెలుగు టీవీ