Wednesday, 16 September 2026 07:41:35 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 22 July 2025 06:22 PM Views : 723

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : టేకులపల్లి మండలంలోని సులనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు, ఔషధాల లభ్యత, పరిశుభ్రత, సిబ్బంది హాజరు, రోగుల రిజిస్టర్లు, డాక్టర్ల హాజరు పత్రాలు, ల్యాబ్ మరియు ఔషధ నిల్వల రికార్డులను పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వ వైద్య కేంద్రాలపై ప్రజల్లో నమ్మకం పెరగాలంటే సేవల నాణ్యతతో పాటు సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించడం ఎంతో అవసరమని కలెక్టర్ అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానిక కావలసిన పరికరాలు, చేపట్టవలసిన అభివృద్ధి పనులపై నివేదికల సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ ముత్యాలంపాడు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు, శుభ్రత, ఉపాధ్యాయుల హాజరు తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించిన కలెక్టర్ వారి పాఠ్య పుస్తకాలు, నోట్‌బుకులు పరిశీలించి, వారికి తెలుగు భాషలో రాయడం, చదవడం ఎంతవరకు వచ్చునో ప్రత్యక్షంగా పరీక్షించారు. విద్యార్థుల చేతిరాతను పరిశీలిస్తూ వారితో ఉపాధ్యాయులు పాఠాలు ఎలా చెబుతున్నారు, భవిష్యత్తులో ఏం అవ్వాలనుకుంటున్నారు అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు పలు సూచనలు చేస్తూ, విద్యార్థుల్లో అభ్యాసంపై ఆసక్తి పెంచేలా బోధన సాగాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్కరికీ చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం వంటి ప్రాథమిక నైపుణ్యాలు కలిగేలా వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. తరగతుల్లో విద్యార్థుల ప్రతిభను మెరుగుపరిచే విధంగా తరచూ అధ్యయనం కొనసాగించాలని అన్నారు. అదే విధంగా పాఠశాల ప్రాంగణం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, తాగునీటి సదుపాయం, విద్యుత్, మరుగుదొడ్ల వంటి మౌలిక వసతులను ఎప్పటికప్పుడు నిర్వహించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాలలో విద్యార్థులు అధికంగా ఉండటం పాఠశాల తరగతులు సరిపోవడంలేదని పరిశీలించిన కలెక్టర్ అదనపు తరగతి గదుల నిర్మాణానికి తగిన ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు మరియు సిబ్బంది మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :