Thursday, 05 November 2026 07:01:32 PM
# మురుసు తుఫాన్‌ బాధిత రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి: సీపీఐ డిమాండ్. # భద్రాద్రి కొత్తగూడెంలో ఐఎఫ్‌ఎంఐఎస్ జిల్లా స్థాయి శిక్షణ విజయవంతం. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిరుద్యోగులకు సువర్ణావకాశం: భారత్ హ్యుందాయ్‌లో ఉద్యోగాల భర్తీకి శనివారం ఇంటర్వ్యూలు! # శాశ్వత పనులతో జిల్లాను మోడల్‌గా నిలపాలి: మంత్రి తుమ్మల. # తుపాను నష్టంపై మంత్రి పొంగులేటి ఉన్నతస్థాయి సమీక్ష. # తుఫాను నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలి: సీపీఐ డిమాండ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా . # బేతుపల్లి చెరువు వరదల్లో చిక్కుకున్న 19 మంది సురక్షితం. # సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి యువజనోత్సవాల ఎంపిక పోటీలు.క్రీడల అధికారి వి. అనూష. # సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీ డిమాండ్ # మురసు తుఫాను పంట నష్టం: రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. # లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యను నివారిస్తాం: మేయర్ మూడ్ గణేష్. # ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతిపై సీపీఐ దిగ్భ్రాంతి: రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # పాములేరు వాగు వరద ఉధృతిని పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు # కండక్టర్ ప్రవళిక మృతి బాధాకరం: కుటుంబానికి కోటి రూపాయల బీమా, ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.మంత్రి పొన్నం ప్రభాకర్. # మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి # తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TDPS) విడుదల చేసిన తాజా వాతావరణ నివేదిక ప్రకారం ముఖ్యాంశాలు # భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్.

ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను లక్ష్యాలకు అనుగుణంగా సమర్థవంతంగా అమలు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 04 July 2026 07:41 PM Views : 180

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక, వనమహోత్సవం, సీజనల్ వ్యాధుల నివారణ, పారిశుధ్య నిర్వహణ, ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ, విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం, ఏకరూప దుస్తుల పంపిణీతో పాటు ఇతర ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలుపై శనివారం సంబంధిత శాఖల అధికారులతో ఐడిఓసి కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ సమగ్రంగా సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామ స్థాయిలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా పనిచేయాలని సూచించారు. ప్రతి శాఖకు నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులో పూర్తి చేసి, పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.వనమహోత్సవం కార్యక్రమంపై కలెక్టర్, జిల్లాలో శాఖలవారీగా నాటిన మొక్కల సంఖ్య, సాధించిన లక్ష్యాలు, పెండింగ్ లక్ష్యాలు, మొక్కల సంరక్షణకు చేపడుతున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించేలా కార్యాచరణను వేగవంతం చేయాలని, నాటిన ప్రతి మొక్క జీవించేలా నీటి వసతి, ట్రీ గార్డులు, క్రమం తప్పకుండా సంరక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మొక్కల నాటకం లక్ష్యాల సాధనతో పాటు వాటి మనుగడకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య కార్యక్రమాలను ముమ్మరం చేయడంతో పాటు నిల్వ నీరు లేకుండా చర్యలు చేపట్టాలని, దోమల నివారణకు యాంటీ లార్వా కార్యక్రమాలు, ఫాగింగ్ నిర్వహించాలని సూచించారు. తాగునీటి వనరులను పరిశుభ్రంగా ఉంచి, వ్యక్తిగత పరిశుభ్రత, సీజనల్ వ్యాధుల నివారణపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు.ప్రతి గ్రామ పంచాయతీలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, చెత్తను సకాలంలో తొలగించడం, కాలువలను శుభ్రపరచడం, పారిశుధ్య కార్మికుల పనితీరును పర్యవేక్షించడం ద్వారా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.ప్రభుత్వ పాఠశాలలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందుతున్న తీరు, వంటశాలల పరిశుభ్రత, పాఠశాలల పారిశుధ్యం, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల హాజరు, బోధన ప్రమాణాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ఏకరూప దుస్తులను అర్హులైన ప్రతి విద్యార్థికి సకాలంలో పంపిణీ చేసి, పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, ఫర్నిచర్ తదితర మౌలిక సదుపాయాలు సక్రమంగా ఉండేలా సంబంధిత అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు.ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలులో అధికారులు క్షేత్రస్థాయిలో తరచూ పర్యటిస్తూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు.వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యా చందన , జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నాగలక్ష్మి , జిల్లా పంచాయతీ అధికారి అనూష, అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీరాజ్ సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్లు, మిషన్ భగీరథ సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు మండల కేంద్రాల నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :