తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాపికొండలు విహారయాత్రకు బ్రేక్ వర్షాల వేల.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్ పడింది. భద్రాచలం రాములోరి దర్శనానికి విచ్చేసిన భక్తులు చాలామంది విహారయాత్ర పాపికొండలకు వెళ్తుంటారు. కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరిలో నీటిమట్టం పెరిగింది. ఈ నేపథ్యంలో అల్లూరి జిల్లా దేవిపట్నం నుంచి పాపికొండలు విహారయాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. గోదావరి నీటిమట్టం తగ్గిన తరువాత తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
Admin
తెలుగు వెలుగు టీవీ