తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల వ్యయాల పర్యవేక్షణ కోసం ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ లావణ్య పోటీ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె ఎన్నికల వ్యయ పరిమితులు, ఖర్చుల నమోదు విధానం, రోజువారీ ఖర్చుల వివరాలు ఎన్నికల అధికారులకు సమర్పించాల్సిన ప్రక్రియలపై అభ్యర్థులకు వివరంగా సూచనలు చేశారు. ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించాలని, ఏ విధమైన అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని అప్రమత్తం చేశారు.సమావేశంలో స్థానిక ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ