తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అన్నదానం మహాదానం అనే సూక్తిని చాటుతూ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కూలీలైన్ 56వ డివిజన్ లో బొమ్మన బోయిన నరేష్ యాదవ్ & న్యూ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు యాదవ్. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించి, భక్తులతో కలిసి అన్నదానంలో పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ - ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కంటే గొప్ప సేవ మరొకటి లేదని, గణేష్ ఉత్సవ కమిటీ సేవా కార్యక్రమం అభినందనీయమని అన్నారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో కొత్తగూడెం ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు, స్థానిక నాయకులు, మహిళలు,యువకులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ