తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం మే 17 తెలుగు వెలుగు ) జూలూరుపాడు మండలం సూరారం గ్రామానికి చెందిన సూర్య, లక్ష్మి, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు లకు చెందిన పశువులు ఉదయం 9 గంటల సమయంలో పంట పొలాలలో మేతకు వెళ్లి రెండు ఎడ్లు పోట్లాడటం వలన విద్యుత్ స్తంభానికి తగిలి స్తంభం విరిగి క్రింద పడిపోయింది. అక్కడే ఉన్న మిగతా మూడు ఆవుల మీద వైర్లు పడి మూడు ఆవులు మరియు పోట్లాడినవి రెండేడ్లు మొత్తం ఐదు పశువులు విద్యుత్ వైర్లు తలిగి చనిపోయినవి. పశువుల యజమానులు పశువుల పై పడి రోధించిన ఘటన గ్రామస్తుల హృదయాలను కలిసి వేసింది. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న జూలూరుపాడు సబ్స్టేషన్ ఏ ఈ సతీష్ సంఘటనా స్థలాన్నీ పరిశీలించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ