Sunday, 02 August 2026 04:54:53 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

కూనంనేని సాంబశివరావుపై ఛానల్ లో వచ్చిన తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన ఎఐటియుసి కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్.

Date : 15 July 2026 10:21 AM Views : 159

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుపై కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేసినట్లు ఛానల్‌లో ప్రసారమైన వార్త పూర్తిగా అవాస్తవమని, నిరాధారమని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్ తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎలాంటి వాస్తవాలు, ఆధారాలు లేకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కథనాలను ప్రసారం చేయడం మీడియా బాధ్యతకు విరుద్ధమన్నారు. ప్రజలకు నిజాలను అందించాల్సిన మీడియా సంస్థలు ధృవీకరణ లేకుండా సంచలనాల కోసం వార్తలు ప్రసారం చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని అన్నారు.ఇటువంటి అసత్య ప్రచారాలు ప్రజల్లో అయోమయం సృష్టించడంతో పాటు ప్రజా ప్రతినిధుల ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నమేనని విమర్శించారు.కొత్తగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలు, కార్మికులు, రైతులు, గిరిజనులు, పేదల పక్షాన నిరంతరం పోరాటాలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని చూరగొంటున్నారని వంగ వెంకట్ పేర్కొన్నారు.సీపీఐ పార్టీకి రోజురోజుకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి రాజకీయంగా తట్టుకోలేని కొందరు కావాలనే అసత్య ప్రచారాలకు తెరలేపుతున్నారని ఆరోపించారు.ఇలాంటి దుష్ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించలేరని, వాస్తవాలు ఎప్పటికైనా వెలుగులోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు.రాజకీయ లబ్ధి కోసం అసత్యాలను ప్రచారం చేయడం అత్యంత నీచమైన చర్య అని పేర్కొంటూ, బాధ్యతాయుతమైన జర్నలిజం పాటిస్తూ నిజానిజాలను నిర్ధారించిన తర్వాతే వార్తలను ప్రసారం చేయాలని మీడియా సంస్థలకు సూచించారు.ప్రజా ప్రతినిధులపై నిరాధార ఆరోపణలు,అసత్య కథనాల ప్రసారం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, ఇలాంటి ప్రచారాలను ప్రజలు విశ్వసించరని వంగ వెంకట్ అన్నారు.వాస్తవాలే ఎప్పటికీ గెలుస్తాయని, అసత్య ప్రచారాలు ఎక్కువకాలం నిలవవని ఆయన పేర్కొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :