తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెంలోని పలు రెస్టారెంట్లు, హోటల్లో జిల్లా పౌరసరఫరాల అధికారి బుధవారం తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో వ్యాపార సిలిండర్లకు బదులుగా డొమెస్టిక్ సిలిండర్లు వాడుతున్నట్లు గుర్తించారు. మొత్తం 11 సిలిండర్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. తదుపరి చర్యలకు కలెక్టర్కు నివేదిక సమర్పించామని వెల్లడించారు. నిబంధనలకు అనుగుణంగా వ్యాపార సిలిండర్లు ఉపయోగించాలని సూచించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ