తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పాల్వంచ : పాల్వంచ పట్టణ పరిధిలోని ఇందిరాకాలనీ సమీపంలో మంగళవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బైక్ పై ఇద్దరు వ్యక్తులు వేగంగా వెళ్తూ పక్కనే డివైడర్ ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. అటు అదే ప్రాంతంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు.
Admin
తెలుగు వెలుగు టీవీ