తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 29 (తెలుగు వెలుగు) : ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు నిర్వహించనుంది. త్వరలోనే అన్ని జిల్లాల్లోని కాలేజీల్లో తరగతులు మొదలు కానున్నాయి. ముఖ్యంగా సెకండియర్ లో ఒక్క సబ్జెక్టు ఫెయిలైన వారిపై అధ్యాపకులు ఫోకస్ చేశారు. మే 22 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయి.
Admin
తెలుగు వెలుగు టీవీ