Thursday, 05 November 2026 02:02:53 AM
# సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి యువజనోత్సవాల ఎంపిక పోటీలు.క్రీడల అధికారి వి. అనూష. # సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీ డిమాండ్ # మురసు తుఫాను పంట నష్టం: రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. # లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యను నివారిస్తాం: మేయర్ మూడ్ గణేష్. # ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతిపై సీపీఐ దిగ్భ్రాంతి: రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # పాములేరు వాగు వరద ఉధృతిని పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు # కండక్టర్ ప్రవళిక మృతి బాధాకరం: కుటుంబానికి కోటి రూపాయల బీమా, ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.మంత్రి పొన్నం ప్రభాకర్. # మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి # తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TDPS) విడుదల చేసిన తాజా వాతావరణ నివేదిక ప్రకారం ముఖ్యాంశాలు # భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు.

ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియకు రాజకీయ పార్టీల సహకారం అవసరం - జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 20 May 2026 05:29 PM Views : 330

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితాలు వెంటనే సమర్పించాలి - జిల్లా కలెక్టర్ అంకిత్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) మ్యాపింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయడానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టనున్న ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను పారదర్శకంగా, ఖచ్చితంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు తమ బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితాలను వెంటనే సమర్పించాలని సూచించారు. బీఎల్‌వోలు నిర్వహించే ఇంటింటి సర్వే కార్యక్రమానికి రాజకీయ పార్టీల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. జూన్ 2026 నుండి బీఎల్‌వోలు ఇంటింటి సర్వే నిర్వహించి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తారని, ప్రతి ఓటరు ఇంటిని కనీసం ఒక్కసారైనా సందర్శించి అవసరమైతే మూడు సార్లు వరకు వెళ్లి ఫారాలు సేకరిస్తారని చెప్పారు. ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ ప్రక్రియ జూన్ 26 నుండి ప్రారంభమై 24-07-2026 లోపు పూర్తవుతుందని తెలిపారు. అనంతరం 31-07-2026న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించి, 31-07-2026 నుండి 30-08-2026 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరిస్తామని చెప్పారు. 01-10-2026న తుది ఓటరు జాబితా ప్రచురణ ఉంటుందని తెలిపారు. చిరునామా మార్పులు, ఇతర సవరణల కోసం ఫారం-8 ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. ఓటర్లు తమ పేరు ఎస్‌ఐఆర్-2002 జాబితాలో ఉందో లేదో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి అధికారిక వెబ్‌సైట్ లేదా ఈసీఐ ఓటర్స్ పోర్టల్‌లో “సెర్చ్ బై ఎలెక్టర్ డిటైల్స్” ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ఆధార్ నంబర్ ఇవ్వడం పూర్తిగా ఐచ్చికమని స్పష్టం చేశారు. 18 సంవత్సరాలు పూర్తిచేసుకున్న వారు ఫారం-6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవచ్చని, 01 అక్టోబర్ 2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకునే వారికీ అవకాశం ఉంటుందని తెలిపారు. ఫారం నింపడంలో లేదా వివరాల ధృవీకరణలో సహాయం కోసం బీఎల్‌వోలు, 1950 హెల్ప్‌లైన్, ఈసీఐ ఓటర్స్ పోర్టల్ మరియు “బుక్ ఏ కాల్ విత్ బీఎల్‌వో” సౌకర్యాలను వినియోగించుకోవచ్చని సూచించారు. విదేశాల్లో లేదా ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగం చేస్తున్న ఓటర్ల తరపున కుటుంబంలోని పెద్ద సభ్యుడు ఫారం నింపి బీఎల్‌వోకు సమర్పించవచ్చని తెలిపారు. అనంతరం జిల్లా ఎన్నికల మాస్టర్ ట్రైనర్ పూసపాటి సాయి కృష్ణ ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రాముఖ్యత, ఫారాల నింపే విధానంపై రాజకీయ పార్టీ ప్రతినిధులకు అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో ఎన్నికల సూపరింటెండెంట్ రంగ ప్రసాద్, జిల్లా ఎన్నికల మాస్టర్ ట్రైనర్ పూసపాటి సాయి కృష్ణ, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి రాంబాబు, భారతీయ జనతా పార్టీ ప్రతినిధి ప్రభాకర్ రెడ్డి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి దేవి ప్రసన్న, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ప్రతినిధి కంచర్ల జమలయ్య, ఎన్నికల సిబ్బంది నవీన్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :