Wednesday, 04 November 2026 06:13:10 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

అంగన్వాడి సేవలు విస్తృతపరచాలి. జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ సౌరబ్ శర్మ.

Date : 03 November 2025 08:49 PM Views : 452

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి క్షేత్రస్థాయిలో అంగనవాడి సేవలు విస్తృతపరచాలని జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ సౌరబ్ శర్మ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హల్ నందు జిల్లా సంక్షేమ అధికారిని జె. స్వర్ణలత లెనినా అధ్యక్షతన జిల్లాలోని సిడిపివోలు, సూపర్వైజర్లు, పోషణ అభియాన్ సిబ్బందితో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ సౌరబ్ శర్మ మాట్లాడుతూ ప్రతి అంగనవాడి కేంద్రంలో పిల్లల ఎత్తు బరువు క్రమం తప్పకుండా త్రూచి వారి పెరుగుదల పర్యవేక్షణ పై సమగ్ర నివేదిక అందజేస్తూ పోషణలోప నివారనకు చర్యలు చేపట్టాలని, తీవ్ర పోషణ లోపం, అతి తీవ్ర పోషణ లోపం ఉన్న పిల్లలను వైద్యశాఖ సమన్వయంతో పరీక్షలు నిర్వహించి న్యూట్రిషన్ రిహాబిటేషన్ కేంద్రానికి సిఫార్సు చేసి పోషణలోప నివారణకు చర్యలు చేపట్టాలన్నారు, జిల్లాలో 295 అంగన్వాడి కేంద్రాలలో పెరటి తోట పెంపకాలు చేపట్టడం జరుగుతుందని, తద్వారా వచ్చే పౌష్టికారం అంగనవాడి కేంద్రాలలో నమోదైన లబ్ధిదారులకు అందజేసి పౌష్టిక విలువలు పెంపొందించాలన్నారు. అదేవిధంగా జిల్లాలో వివిధ పథకాల ద్వారా మంజూరైన పక్కా భవనాలు, త్రాగునీరు, టాయిలెట్స్ త్వరతగతిన పూర్తి చేయాలన్నారు. ప్రతిరోజు అంగన్వాడి కేంద్రంలో నమోదైన లబ్ధిదారుల హాజరు శాతం వేయాలని ప్రతిరోజు అంగనవాడి కేంద్రం 9 గంటల లోపు తెరిచి షెడ్యూల్ ప్రకారం పూర్వ ప్రాథమిక విద్య విద్యార్థులకు అందజేయాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారిని జే స్వర్ణలత లెనినా , జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయ సూపర్డెంట్ ముత్తయ్య, సీనియర్ అసిస్టెంట్ పాషా, జిల్లాలోని సిడిపివోలు, సూపర్వైజర్లు, పోషన్ అభియాన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :