తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మహాలక్ష్మి పథకం, కొత్త, పెంచుతామనుకున్న సామాజిక పెన్షన్లకు ఈ బడ్జెట్ సమావేశంలో నిధులు కేటాయించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రజా ప్రభుత్వ నిలబెట్టుకోవాలని 16వ డివిజన్ కార్పొరేటర్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యురాలు మునిగడప పద్మ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం జరిగిన మహిళ సమావేశంలో ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు ఇసికి వేసారిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆరోజు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి అధికారం చేపట్టిన రోజు సామాజిక పెన్షన్లు నాలుగు వేలకు పెంచుతున్నామని మొట్టమొదటి సంతకం పెట్టి రెండున్నర సంవత్సరాలు గడిచిన పెంచిన పెన్షన్లు అందక వృద్ధులు ,వికలాంగులు, ఒంటరి మహిళలు మానసిక వేదన గురవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రతి ఇంటి మహిళకి మహా లక్ష్మీ పథకం కింద ₹2,500 అకౌంట్ లో వేస్తామన్న ఇచ్చిన హామీ నీటి రాత గానే మిగిలిపోయిందని అన్నారు. గత ఏడు సంవత్సరాల నుండి భర్త చనిపోయి ఆర్థికంగా చితికిపోయినా వితంతువులకి, వికలాంగులకు, వృద్ధులకు కొత్త పెన్షన్లు మంజూరు కాక కొత్త పెన్షన్లు వస్తాయి అన్న ఆశతో వారు జీవిస్తున్నారని అన్నారు. తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం నేడు జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రజలకు ఇచ్చిన ఈ హామీలకు నిధులు కేటాయించి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో మార్తమ్మ, ఎస్కే ఫర్జానా, ఎస్కే కుషీద్ ,బేబీ, పద్మ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ