Thursday, 17 September 2026 08:29:23 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

బూర్గంపహాడ్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ - జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 21 April 2026 02:14 PM Views : 209

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రైతులకు ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ధాన్యం కొనుగోలు నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ అంకిత్ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ వారంలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ అంకిత్ బూర్గంపహాడ్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న సదుపాయాలు, విద్యా కార్యక్రమాల అమలు, పాఠశాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు పాఠశాలలో నిర్వహిస్తున్న టాలెంట్ టెస్ట్, డ్రాయింగ్ పోటీలను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థుల ప్రతిభను అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని , మరింత విస్తృతంగా నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం విద్యార్థులతో నేరుగా మాట్లాడి వసతి, భోజనం, పాఠ్యపుస్తకాలు తదితర సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని సదుపాయాలు సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల కిచెన్ షెడ్‌ను పరిశీలించి, మెనూ ప్రకారం పోషకాహారంతో కూడిన నాణ్యమైన భోజనం అందించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. తాజా కూరగాయల వినియోగం, ఆహార తయారీ, వడ్డింపులో పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. అలాగే పాఠశాల పరిసరాల పరిశుభ్రత, తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాలపై కూడా ఆరా తీశారు. విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం అత్యంత అవసరమని తెలిపారు. అనంతరం బూర్గంపహాడ్ వ్యవసాయ కమిటీ పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కేంద్రంలో నిల్వ ఉన్న ధాన్యాన్ని పరిశీలించి, మాయిశ్చర్ మీటర్ ద్వారా తేమ శాతాన్ని తనిఖీ చేశారు. ధాన్యం నాణ్యత ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియ పురోగతి, పెండింగ్ ధాన్యం వివరాలు తెలుసుకుని, సన్న మరియు దొడ్డు రకం ధాన్యాల కొనుగోలుకు వేర్వేరు ఏర్పాట్లు చేయాలని సూచించారు. రైతులతో మాట్లాడి వారికి ఎదురవుతున్న సమస్యలను తెలుసుకుని, లైటింగ్, తాగునీటి వంటి మౌలిక సదుపాయాలు తక్షణమే కల్పించాలని అధికారులను ఆదేశించారు. పి.ఆర్–126 దొడ్డు రకం ధాన్యం నాణ్యతపై రైతులు వ్యక్తం చేసిన సందేహాలపై వ్యవసాయ శాఖ అధికారులతో చర్చించి, పిన్‌పాయింట్ డ్యామేజ్ సమస్యపై పూర్తి వివరాలు సేకరించి ఉన్నతాధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నాణ్యత ప్రమాణాల విషయంలో స్పష్టత తీసుకువచ్చి రైతులకు నష్టం కలగకుండా చూడాలని తెలిపారు ప్రతి రైతు వద్ద ఉన్న చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని, ఎవరూ నష్టపోకుండా కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కొనుగోలు రిజిస్టర్, రసీదు పుస్తకాలను పరిశీలించి నమోదు విధానాన్ని సమీక్షించారు. ఈ పర్యటనలో తహసీల్దార్ ప్రసాద్, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, ఎంపీడీవో జమలారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :