తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : చండ్రుగొండ మండలం బెండలపాడులో CM రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామానికి చేరుకున్న ముఖ్య మంత్రికి ఆదివాసీ నృత్యాలతో గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కొత్తగా నిర్మించిన ఇళ్లను ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ