తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ రోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లాలోని కోర్టు డ్యూటీ అధికారులతో ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వర్తించాలని సూచించారు. పలు పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న కేసులు వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.కేసులు పెండింగ్ ఉండడానికి గల కారణాలను తెలుసుకున్నారు.ఎప్పటికప్పుడు కేసుల పురోగతి వివరాలను ఉన్నతాధికారులకు తెలియజేస్తూ కేసులలోని ప్రతి విషయాన్ని ఆన్లైన్లో నిక్షిప్తం చేయాలని సమావేశంలో పాల్గొన్న కోర్టు డ్యూటీ అధికారులకు తెలియజేసారు.విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వారిపై క్రమశిక్షణా చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని హెచ్చరించారు.NBW (నాన్ బెయిలబుల్ వారెంట్స్) జారీ విషయంలో అలసత్వం వహించచకుండా వ్యవహరించాలని సూచించారు.నేరస్థులకు శిక్ష పడే విధంగా కృషి చేసి కన్వీక్షన్ రేటును పెంచాలని కోరారు.ఏవైనా సందేహాలు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారుల సలహాలు సూచనలతో కేసుల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిఆర్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ నాగరాజు రెడ్డి,ఎస్సైలు హారిక,హసీనా మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ