Wednesday, 16 September 2026 04:23:24 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

భ ద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆలోచనలోనుంచి మరో మార్గదర్శకం: బయోచార్ జిల్లాలో బయోచార్‌తో ముందుకు వెళ్లాలని ఆకాంక్ష

Date : 24 May 2025 09:00 PM Views : 606

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తక్కువ ఆక్సిజన్ (గాలి) తో ఎండిపోయిన మొక్కలు, పనికిరాని చెట్ల కొమ్మలను కాల్చడం ద్వారా ఏర్పడే శాశ్వత కార్బన్ నిల్వతో కూడిన బొగ్గే బయోచార్" అని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. ప్రకృతి వ్యవసాయం మరియు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడేలా బయోచార్ తయారీకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ దిశగా ఆయన కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయం పక్కనే స్వయంగా మొట్టమొదటి ప్రయోగాత్మక ప్రదర్శనను నిర్వహించారు. ముందుగా ఒక ఖాళీ డ్రమ్ తీసుకొని దాని కింద భాగంలో గాలి ప్రవేశించేలా రంధ్రాలు చేశారు. ఆ డ్రమ్‌ను మూడు సిమెంట్ రింగుల మధ్య ఉంచి, అడుగులో ఎండిన ఆకులు వేసి మంట వెలిగించారు. పైభాగంలో ఎండిపోయిన, పనికిరాని మొక్కల భాగాలను వేసి, డ్రమ్‌కి మూత పెట్టారు. రింగుల మధ్యలోనూ ఆకులు, పొట్లులు వేసి మంట పెట్టడంతో లోపల ఏర్పడే పొగ తక్కువగా ఉంటుంది. తక్కువ ఆక్సిజన్‌లో కాలిన మొక్కలు బూడిదగా మారకముందే వాటిని నీటితో చల్లార్చితే, ఏర్పడిన బొగ్గును బయోచార్ అంటారని కలెక్టర్ స్వయంగా ప్రదర్శించారు.దీనిని పొడి లాగా చేసి పంటపొలాల్లో వాడితే మంచి ఫలితాలు ఇస్తాయని పేర్కొన్నారు, దీనికి పశు మూత్రం జోడించి ఉపయోగిస్తే మరింత ఫలితం ఉంటుందని తెలిపారు. బయోచార్ అంటే ఏమిటి? కలెక్టర్ మాటల్లో...బయోచార్ అనేది పంట మిగులు, ఎండిపోయిన మొక్కలు, చెట్ల కొమ్మలు వంటి జీవ పదార్థాలను తక్కువ ఆక్సిజన్ ఉన్న పరిస్థితుల్లో కాల్చి తయారుచేసే ప్రకృతి మిత్ర పదార్థం. ఇది శాశ్వతంగా కార్బన్ నిల్వ చేస్తూ, నేల ఆరోగ్యాన్ని పెంపొందించే గుణాలు కలిగి ఉంటుంది. కలెక్టర్ బయోచార్ యొక్క ఉపయోగాలను ఈ విధంగా వివరించారు:మట్టిలో జీవ పదార్థం పెంపు, నీటి నిల్వ సామర్థ్యం మెరుగుదల, ఎరువుల అవసరం తగ్గింపు, వాతావరణ మార్పుల ప్రతికూలతలను తగ్గించే శాశ్వత కార్బన్ నిల్వ, నేల స్థిరంగా ఉండేలా చేయడం వంటి ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు. పంట అనంతరం మిగిలిన మొక్కల చెత్త, గ్రామ శుభ్రపరిచే పనుల్లో వెలువడే చెట్ల భాగాలు వంటి వనరులు విరివిగా లభిస్తున్నాయి. వీటిని వినియోగించి గ్రామస్థాయిలో చిన్న బయోచార్ యూనిట్లు ఏర్పాటు చేస్తే, రైతులకు ఆర్థికంగా లాభదాయకంగా ఉండటమే కాకుండా, స్వయం ఉపాధికి మార్గం సుగమమవుతుంది. ఇది ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే ఉత్తమ మార్గంగా నిలుస్తుందని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పేర్కొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :