Wednesday, 16 September 2026 05:59:47 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

డి హెచ్ పి ఎస్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ప్లకార్డులతో నిరసన.

Date : 08 October 2025 07:38 PM Views : 565

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ముఖ్యఅతిథిగా పాల్గొన్న డిహెచ్పిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సలిగంటి శ్రీనివాస్. డిహెచ్పిఎస్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ (బి.ఆర్) గవాయ్ పై జరిగిన దాడికి నిరసనగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం, కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి తోలుత పూలమాలవేసి ఘన నివాళులు అర్పించి అనంతరం ఫ్ల కార్డులతో నిరసన వ్యక్తం చేసిన సిపిఐ అనుబంధ సంఘం దళిత హక్కుల పోరాట సమితి (డి హెచ్ పి ఎస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకత్వం. ఈ కార్యక్రమానికి డిహెచ్పిఎస్ జిల్లా నాయకులు బరిగెల భూపేష్ కుమార్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు,డిహెచ్పిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సలిగంటి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయ్ పై దాడి జరగడం భారతదేశ న్యాయ చరిత్రలో చీకటి అధ్యాయనమని పేర్కొన్నారు. జస్టిస్ గవాయ్ పై దాడి చేసిన సీనియర్ న్యాయవాది రాకేష్ కిషోర్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి తక్షణమే బహిష్కరించి నాన్బెయిలబుల్ కేసు పెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇది కేవలం జస్టిస్ గవాయ్ పై జరిగిన దాడి మాత్రమే కాదని భారత రాజ్యాంగంపై జరిగిన దాడిగా భావించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిహెచ్పిఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు చెన్నయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కరిషా రత్నకుమారి, రాష్ట్ర సమితి సభ్యురాలు మామిడి ధనలక్ష్మి, డి హెచ్ పి ఎస్ జిల్లా నాయకులు రవి కిరణ్, కొచ్చర్ల రాకేష్ కాంత్, టి. నర్సింగరావు ,జంగం ప్రసాదరావు, మంద నిర్మల, పి.భాగ్య, మద్దెల విజయలక్ష్మి, మెరుగు అనసూయ, దార్ల లక్ష్మి, అన్నెం లక్ష్మీనారాయణ,పి.రోజా, ఉస్మాన్ ఖాన్, పి.నర్సిరెడ్డి, బి. సత్తెమ్మ,కే. భారతి, ఎండి ఆశబి, ఎండి యాకుబ్ పాషా, ఎస్.కె అహ్మద్ బాషా బట్టు సన్నీ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :