తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 28(తెలుగు వెలుగు) : కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఈ నెల 20వ తారీకు నాడు 34వ వార్డ్ కూలీలైన్ అంగన్వాడీ సెంటర్ నం:12 లో స్కూల్ టీచర్ గిరి లక్ష్మీ గారి ఆధ్వర్యం లో అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు.గిరి లక్ష్మీ గారు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించాలని ఉద్దేశం తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోషణ పక్షం కార్యక్రమాన్ని చేపట్టింది అని ఆరోగ్యవంతమైన జీవనానికి, శారీరక మానసిక ఎదుగుదలకు పుట్టిన తొలి నాళ్లలో మొదటి 1000 రోజులలో తీసుకునే సమతుల్య, పోషకాహారం ఎంతో కీలకం అని రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున పిల్లల పట్ల జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. గర్భిణులు తమ ఆరోగ్యంపై దృష్టి సారించి హిమోగ్లోబిన్ శాతం మెరుగుపర్చుకోవాలని పుట్టిన బిడ్డకు మొదటి ఆరునెలలు తల్లి పాలు మాత్రమే పట్టించాలని...అలా ఇవ్వాలంటే తల్లి ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ఈ యొక్క కార్యక్రమం లో బాలింతల తల్లులు,పిల్లలు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ