Wednesday, 16 September 2026 09:58:01 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

ఆరవ రోజు ఘనంగా బతుకమ్మ వేడుకలు

Date : 27 September 2025 10:29 AM Views : 336

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దసరా సంబరాల్లో భాగంగా ఆరవ రోజు ‘అలిగిన బతుకమ్మ’ వేడుకలను ఐడిఓసి కార్యాలయంలో జిల్లా పరిషత్, జిల్లా సహకార శాఖ మరియు ఏడి మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణం పూలతో, రంగవల్లులతో కళకళలాడింది. సాంప్రదాయ వాతావరణంలో మహిళా ఉద్యోగులు, సిబ్బంది బతుకమ్మలను అలంకరించి సమిష్టిగా పూజలు నిర్వహించారు.ఈ వేడుకలకు ప్రత్యేక అతిథులుగా జిల్లా అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి హాజరై బతుకమ్మల చుట్టూ తిరుగుతూ మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ ఆనందంగా ఆడిపాడారు. పండుగ సందర్భంగా మహిళా శక్తి, తెలంగాణ సంప్రదాయం, సాంస్కృతిక ఐక్యత ప్రతిబింబించేలా కార్యక్రమం కొనసాగింది.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ విద్యా చందన మాట్లాడుతూ... “బతుకమ్మ పండుగ మన తెలంగాణ ఆడబిడ్డల గౌరవానికి ప్రతీక. పూలతో సృష్టించిన ఈ సాంప్రదాయ బతుకమ్మ మన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఉద్యోగిణులు, సిబ్బంది అందరూ ఉత్సాహంగా పాల్గొని పండుగను ఘనంగా జరుపుకోవడం అభినందనీయం అని అన్నారు.జడ్పీ సీఈవో నాగలక్ష్మి మాట్లాడుతూ... “బతుకమ్మ పండుగలో సాంస్కృతిక, సామాజిక ఐక్యత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ తరహా వేడుకలు ఉద్యోగులు, అధికారులు మధ్య అనుబంధాన్ని పెంచుతాయి. పూలతో చేసిన ఈ బతుకమ్మలో ప్రకృతి, పర్యావరణ పరిరక్షణకు ఉన్న ప్రాధాన్యత కూడా మనకు గుర్తు చేస్తుంది అని పేర్కొన్నారు.కార్యక్రమంలో మహిళా ఉద్యోగులు సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొని బతుకమ్మలతో పాటలు పాడుతూ ఆనందంగా గడిపారు. ఈ వేడుకల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని స్వర్ణలత లేనినా, డిసిఒ రుక్మిణి, టేకులపల్లి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సులోచన రాణి, టీజీవోస్ జిల్లా అధ్యక్షులు వెంకట పుల్లయ్య, మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :