తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం టౌన్ పంజాబ్ గడ్డకు చెందిన మధుసూధన్ (41) బాత్రూంలో కాలుజారి కిందపడి మృతి చెందాడు. మధుసూదన్ పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పనికి వెళ్లేందుకు స్నానం చేయడానికి బాత్రూంకి వెళ్లగా జారీ కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో అతని గొంతుకు తీవ్రగాయమైంది. వెంటనే 108కు ఫోన్ చేసి స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి భార్య ఫిర్యా దుతో 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ