Wednesday, 16 September 2026 09:15:52 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

విద్యార్థుల నమోదు పెంపుదల లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

Date : 14 May 2025 01:15 PM Views : 764

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం మే 14 తెలుగు వెలుగు ) : ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదును పెంచే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని, దీనికోసం నాణ్యమైన విద్యను అందించడమే ప్రధాన లక్ష్యం అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లాస్థాయిలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు జరుగుతున్న వృక్షంత్ర శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశిక్షణ కేంద్రంలో సందర్శించిన ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలన్నా, ప్రభుత్వ పాఠశాలలను నిలబెట్టి విద్యను అందరికీ అందే విధంగా కృషి చేయాలన్న నాణ్యమైన విద్యను అందించడమే మార్గమని దీనికి వేరే ప్రత్యామ్నాయం లేదని తెలిపారు. నాణ్యమైన విద్యను అందించడంలో భాగంగా వృక్షంతర శిక్షణా కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, వచ్చే విద్యా సంవత్సరం నుండి సాంకేతిక పరిజ్ఞానాన్ని తరగతి గదిలో వినియోగించడం, మౌలిక భాష మరియు గణిత అభివృద్ధి కార్యక్రమాన్ని కృత్రిమ మేధా ఆధారంగా అభివృద్ధి పరచటం, పాఠశాల విద్యలో నూతనంగా ప్రవేశపెట్టబడుతున్న కృత్రిమ మేధ పాఠ్యాంశాలను పిల్లలకు అందించడం అనే మూడు నూతన విషయాలతో ఈ కార్యక్రమం రూపొందించబడిందని దీనిని ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు అందరూ అందిపుచ్చుకొని ప్రభుత్వ పాఠశాల విద్యాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. పాఠశాలలలో మౌలిక వసతుల కల్పనకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని, మౌలిక వసతులలో ఏ విధమైన అంతరాలు ఉన్న జిల్లా విద్యాశాఖ అధికారి కి తెలియజేస్తే సాధ్యమైనంత వరకు ఏర్పాటు చేయటానికి తప్పనిసరిగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంలో ఉపాధ్యాయులకు ఎవరూ ప్రత్యామ్నాయం కాదని ఉపాధ్యాయ సర్వశక్తిమంతులని కావున వారంతా ప్రభుత్వ విద్య పరిరక్షణకు తప్పనిసరిగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. వెంకటేశ్వర చారి, జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఏ,l. నాగరాజశేఖర్, జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ ఎన్. సతీష్ కుమార్, జిల్లా రిసోర్స్ పర్సన్లు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :