Wednesday, 16 September 2026 09:53:25 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

కొత్తగూడెంలో ఆటో కార్మికుల విజయోత్సవ ర్యాలీ

Date : 24 August 2026 04:32 PM Views : 123

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ???? హామీలు అమలుచేయకుంటే సమ్మె పోరాటం తప్పదు ???? ఇచ్చిన గడువులోపు 13 సమ్మె డిమాండ్లు పరిష్కరించాలి ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కంచర్ల జమలయ్య రవాణా రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసమే హైదరాబాద్‌లో రవాణా కమిషనర్‌తో చర్చలు జరిపినట్లు ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కంచర్ల జమలయ్య తెలిపారు. జేఏసీ చర్చలు సఫలమైన సందర్భంగా ఏఐటీయూసీ, జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం కొత్తగూడెం పట్టణంలో కార్మికులు ఆటోలతో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కార్యాలయం శేషగిరిభవన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్ సెంటర్, రైల్వే స్టేషన్, ఎంజీ రోడ్డు మీదుగా బస్టాండ్ సెంటర్‌కు చేరుకుంది. అనంతరం జరిగిన సభలో కంచర్ల జమలయ్య మాట్లాడారు. సమ్మె నోటీసులోని 13 ప్రధాన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. దీంతో రాష్ట్రవ్యాప్త సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల హామీ ప్రకారం ప్రతి కార్మికుడికి ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసిందన్నారు. ఆర్టీసీకి ఈవీ ఆటోలు ఇచ్చే నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకుందని స్పష్టం చేశారు. రవాణా రంగ కార్మికులకు భరోసా కల్పించేలా సంక్షేమ బోర్డు ఏర్పాటుకు అధికారులు లిఖితపూర్వక హామీ ఇచ్చారని చెప్పారు. పోరాటాలతోనే కార్మిక సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన స్పష్టం చేశారు. విజయోత్సవ ర్యాలీలో టాడు నాయకులు ధర్మపురి నరేష్, టిఆర్ఎస్ నాయకులు వీరన్న, బిఎంఎస్ నాయకులు బండారి యాదగిరి, బత్తుల సత్యనారాయణ, మర్రి కృష్ణ, ఆరెళ్లి కృష్ణ, బడుగు భాస్కర్, బాబా, రాంబాబు, షాకీర్ పాషా తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :