Wednesday, 16 September 2026 05:48:23 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియపై పూర్తి అవగాహనతో విధులు నిర్వర్తించాలి – కలెక్టర్ అంకిత్.

Date : 22 June 2026 06:38 PM Views : 169

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)-2026 ప్రక్రియపై పూర్తి అవగాహనతో విధులు నిర్వర్తించి, ఎన్నికల సంఘం నిర్దేశించిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2026లో భాగంగా ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, ఎంటీలు, బీఎల్‌వో సూపర్‌వైజర్లు, ఏఎల్‌ఎంటీలు, మండల ఆపరేటర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ అంకిత్ పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పారదర్శకమైన, ఖచ్చితమైన ఓటరు జాబితా రూపకల్పన కోసం భారత ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందని తెలిపారు. ఈ నెల 25వ తేదీ నుండి జూలై 24వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటింటి సర్వేలో భాగంగా బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటిని సందర్శించి ఓటరు మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందజేసి, అవసరమైన వివరాలను సేకరించి బీఎల్‌వో యాప్‌లో నమోదు చేయాలని తెలిపారు.ఓటరు జాబితాలో పేర్లు ఉన్న వ్యక్తులు ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లారా, మరణించారా, ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటరు నమోదై ఉన్నారా అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. ఓటరు జాబితాలో పేర్లు, చిరునామాల సవరణ, మరణించిన వారి పేర్ల తొలగింపు వంటి అంశాలను నిబంధనల మేరకు నిర్వహించాలని తెలిపారు. ప్రత్యేక సమగ్ర సవరణ ద్వారా సేకరించిన సమాచారమే తుది ఓటరు జాబితా రూపకల్పనకు ప్రామాణికంగా ఉండనున్నందున ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అత్యంత బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హత కలిగిన వ్యక్తి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా ఫారం-6 ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని తెలిపారు. ప్రతి వ్యక్తికి ఒకే చోట ఓటు హక్కు ఉండాలని, ఉద్దేశపూర్వకంగా రెండు లేదా అంతకంటే ఎక్కువ చోట్ల ఓటరు నమోదు చేసుకోవడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. అటువంటి సందర్భాల్లో క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీని ఇతరులకు తెలియజేయరాదని, అలా చేయడం కూడా నేరంగా పరిగణించబడుతుందని స్పష్టం చేశారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ మాట్లాడుతూ , ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. బీఎల్‌వోలు ఇంటింటి సర్వేలో సేకరించే వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. బీఎల్‌వో యాప్‌లో వివరాలను సకాలంలో నమోదు చేసి, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా కొనసాగేలా కృషి చేయాలని సూచించారు.భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ మాట్లాడుతూ , ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో ఒక్క అర్హ ఓటరు కూడా మిగిలిపోకుండా చూడాలని అన్నారు. ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖుల ఓటరు వివరాల ధృవీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన విధివిధానాలను కచ్చితంగా పాటిస్తూ సర్వే నిర్వహించాలని తెలిపారు.అదనపు కలెక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ , శిక్షణలో వివరించిన అంశాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని, ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి నివృత్తి చేసుకోవాలని తెలిపారు.శిక్షణ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్ పూసపాటి సాయి కృష్ణ, ఎన్నికల సూపర్డెంట్ రంగ ప్రసాద్ ఎస్‌ఐఆర్ ప్రక్రియ, ఎన్యూమరేషన్ ఫారాల నిర్వహణ, బీఎల్‌వో యాప్ వినియోగం, ఓటరు మ్యాపింగ్, ఫారాల పరిశీలన, డేటా నమోదు తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్ర అవగాహన కల్పించారు.కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రవీంద్రనాథ్, కొత్తగూడెం ఆర్డీవో మధు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, ఎంటీలు, బీఎల్‌వో సూపర్‌వైజర్లు, ఏఎల్‌ఎంటీలు, మండల ఆపరేటర్లు, ఎన్నికల శాఖ సిబ్బంది నవీన్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :