తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గాజులరాజం బస్తి శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి దేవాలయంలో నెల రోజులుగా నిర్వహించిన శ్రావణ మాస బోనాల జాతర మహోత్సవం ఘనంగా ముగిసింది. జాతర చివరి రోజైన బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్న భక్తులు చివరి రోజు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమంలో భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు.ఈ మహోత్సవానికి నగర మేయర్ శ్రీ మూడు గణేష్, 56వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి గడ్డం శాంతిప్రియా సతీష్ బాబు, 57వ డివిజన్ కార్పొరేటర్ సహెరా బేగం యూసుఫ్, వివిధ డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు, వ్యాపారవేత్తలు, వైద్యులు, ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు.అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. జాతర మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన సభ్యులు, భక్తులు, దాతలకు ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అమ్మవారి ఆశీస్సులు భక్తులందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ