తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం చిట్టి రామవరం తండా 19వ డివిజన్, 11వ వార్డు కు నివాసులైన గిరిజన లంబాడ పోడు రైతులు బానోత్ శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్కే షాబీర్ పాషా కి పోడు సమస్యల గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.. కొత్తగూడెం ఫారెస్ట్ డివిజన్ రామవరం ఫారెస్ట్ రేంజ్ రామవరం బ్లాక్ గరిపేట గ్రామ పరిధిలోని అంబేద్కర్ నగర్ బిట్ ఫారెస్ట్ కంపార్ట్మెంట్ నెంబర్ వన్ సర్వేనెంబర్ 20 లో నిర్వహించిన మా యొక్క ఆర్ ఓ ఎఫ్ ఫారెస్ట్ భూములకు సర్వే అయినా మా భూములను ఫారెస్ట్ పోడు పట్టా లు ఇప్పించ గలరని పలుమార్లు అధికారుల చుట్టూ తిరుగుతున్న మా పోడు పట్టాల కోసం నిస్సహాయంగా తిరుగుతున్నాము కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల మా పోడు రైతులకు అన్యాయం జరుగుతుందని మా గోడును విన్నవించుకొని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్కే షబీర్ పాషా ని కలిసి ప్రజల పక్షాన సిపిఐ పార్టీ ఎల్లవేళ పనిచేస్తుందని పోడు రైతులు ఎవరు అధైర్య పడద్దని రైతులకు అధికారులతో మాట్లాడి పట్టాలు ఇస్తాను అని హామీ ఇవ్వడం జరిగింది.
Admin
తెలుగు వెలుగు టీవీ