Thursday, 17 September 2026 02:17:07 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

జిల్లాలో ఆర్టిఐ అమలుపై రాష్ట్ర కమిషనర్ల పర్యటన : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 30 July 2025 04:44 PM Views : 652

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) అమలు పరిస్థితిని సమీక్షించేందుకు రాష్ట్ర ముఖ్య సమాచార కమిషనర్లు పి.వి. శ్రీనివాసరావు, దేశాల భూపాల్ మరియు బోరెడ్డి అయోధ్య రెడ్డి జిల్లా పర్యటన చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ రెండు రోజుల పర్యటనలో భాగంగా, జూలై 31 (గురువారం) ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు అన్ని శాఖల ప్రజా సమాచార అధికారులు (PIOలు) మరియు అప్పిలేట్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించబడుతుందని, అలాగే మధ్యాహ్నం 3:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు అప్పీలు దారుల తో విచారణ కలెక్టర్ పేర్కొన్నారు.ఆగస్టు 1 (శుక్రవారం) ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు మరో విడత ఆర్టీఐ అప్పీల్ విచారణలు జిల్లా కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించబడతాయని వివరించారు.ఈ సందర్బంగా, అన్ని శాఖల పి ఐ ఓ లు మరియు అప్పిలేట్ అధికారులు 6(1) కింద దాఖలైన ఆర్టీఐ దరఖాస్తుల రసీదులు, ప్రశ్నలు, సమాధానాలు, అవసరమైన పాయింట్‌వారీ కౌంటర్ సమాచారంతో విచారణలకు తప్పకుండా హాజరుకావలసినదిగా కలెక్టర్ ఆదేశించారు. అన్ని విభాగాల పి ఐ ఓలు మరియు ఏ ఏ లు ఇంటరాక్షన్ సెషన్‌కు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.సమాచార హక్కు చట్టం అమలులో పారదర్శకత పెంపొందించడంలో భాగంగా, ప్రతి కార్యాలయంలో ఆర్టీఐ బోర్డులను మార్గదర్శకాల ప్రకారం నవీకరించి, ప్రదర్శించాలనీ, ఇందుకు తగిన చర్యలు వెంటనే చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :